తానెప్పుడూ ఓడిపోలేదని చెప్పారు. ఎందుకు ఓడిపోలేదు? 1983లో చంద్రగిరిలో పోటీ చేసి చిత్తుచిత్తుగా ఓడిపోయిందెవరు? తర్వాతే కదా సొంత నియోజకవర్గమైన చంద్రగిరిని వదిలేసి కుప్పంకు వెళ్ళిపోయింది.
చెప్పేవాడు చంద్రబాబునాయుడు అయితే వినేవాళ్లు ఏపి జనాలు. ఎందుకంటే, చంద్రబాబు ఏం చెప్పినా వినాల్సిందే కానీ ఎదురు ప్రశ్నించకూడదు. ఏమన్నా ప్రశ్న వేయగానే ‘నీదేం పేపర్..ఎ అజెండాతో ఇక్కడకు వచ్చావు’..అంటూ మొదలుపెడతారు. అందుకనే చంద్రబాబు ఏం చెప్పినా మీడియా నోరుమూసుకుని రాసుకుని వచ్చేస్తోంది ఈ మధ్య. చంద్రబాబును గోకి మరీ తిట్టించుకోవటం ఎందుకన్నది మీడియా వాదన.
తాజాగా జరిగిందేమిటంటే..చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ, తమనెవరు ఎన్నికల్లో ఓడించలేరన్నారు. తాము చేసిన తప్పిదాల వల్లే తమ పార్టీ గతంలో ఓడిపోయిందని చెప్పారు. ఎంత విచిత్రంగా ఉందో చూడండి చంద్రన్న వాదన. తాము చేసిన తప్పుల వల్లే తమ పార్టీ ఓడిపోవటం ఏమిటి? తమ తప్పుల వల్ల ఓడిపోతే ఏమిటి? జనాలు ఓడిస్తే ఏమిటి? రెండింటికి తేడా ఏముంది?
ఒకవేళ చంద్రన్న చెప్పిందే నిజమైతే అదే సూత్రం ప్రతీ పార్టీకి వర్తిస్తుంది కదా? రాష్ట్ర విభజన జరగక పోయుంటే తామే మళ్ళీ అధికారంలోకి ఉండేవారమని ఆఫ్ ది రికార్డుగా కాంగ్రెస్ నేతలంటుంటారు. ఒకవేళ నిజంగా రాష్ట్ర విభజనే జరగకపోయుంటే ఏపిలో టిడిపి, తెలంగాణాలో టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఎక్కడిది?
అదే విధంగా తానెప్పుడూ ఓడిపోలేదట. ఎందుకు ఓడిపోలేదు? 1983లో చంద్రగిరిలో పోటీ చేసి చిత్తుచిత్తుగా ఓడిపోయిందెవరు? తర్వాతే కదా సొంత నియోజకవర్గమైన చంద్రగిరిని వదిలేసి కుప్పంకు వెళ్ళిపోయింది.
అదే సమయంలో 2019 ఎన్నికల్లో ఎవరు మంచి చేస్తే వారినే జనాలు మళ్ళీ ఎన్నుకుంటారనటంలో అర్ధం ఏమిటి? జనాలకు మంచి చేసే అవకాశం ఎవరికి ఉంటుంది? అధికారంలో ఎవరుంటే వారికే కదా? ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఏం చేయగలరు? ప్రభుత్వాన్ని నిలదీయటం తప్ప? 40 ఇయర్స్ చంద్రబాబుకు ఈ మాత్రం తెలీకుండానే మాట్లాడుతున్నారా? చంద్రబాబు ఎందుకిలా మాట్లాడుతున్నారో మాత్రం ఎవరికీ అర్ధం కావటం లేదు.
