అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం ఉదయం ఉండవల్లిలోని తన నివాసం నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఢిల్లీ పర్యటలో భాగంగా లోక్‌సభలో టీడీపీ అవిశ్వాసానికి మద్దతి తెలిపిన పార్టీలకు సీఎం కృతజ్ఞతలు చెబుతారు.
 
లోక్‌సభలో అవిశ్వాసం, ఆ తర్వాతి పరిణామాలపై చంద్రబాబు ఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారు. ఆయన ఢిల్లీలో బిజెపియేతర పార్టీల నాయకులను కలిసే అవకాశం ఉంది.

చంద్రబాబు వెంట పలువురు మంత్రులు కూడా ఢిల్లీకి బయలుదేరారు.