Asianet News TeluguAsianet News Telugu

కెసిఆర్ పై చంద్రబాబు అసంతృప్తి

  • తెలంగాణా సిఎం కెసిఆర్ పై చంద్రబాబునాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
chandrababu is unhappy over kcr statement

తెలంగాణా సిఎం కెసిఆర్ పై చంద్రబాబునాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కెసిఆర్ వ్యఖ్యలు తనను బాధించినట్లు స్వయంగా చంద్రబాబే చెప్పారు.  ఇంతకీ విషయం ఏమిటంటే, హైదరాబాద్ లో ‘ఇండియా టుడే’ ఆధ్వర్యంలో ఓ సదస్సు జరిగింది. ఆ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ, అభివృద్ధిలో ఏపికి తెలంగాణాకు పోలికే లేదన్నారు. హైదరాబాద్ ను అభివృద్ధి చేసిందే తానని ఇంతకాలం చంద్రబాబు చెప్పుకుంటన్న సంగతి అందరికీ తెలిసిందే. అటువంటిది హైదరాబాద్ అభివృద్ధిలో చంద్రబాబు పాత్రేమీ లేదన్నట్లుగా తీసిపడేసారు.

400 సంవత్సరాల క్రితమే హైదరాబాద్ అభివృద్ధి చెందిందన్నట్లుగా చెప్పారు. మద్రాసులో కరెంటు లేని రోజుల్లోనే హైదరాబాద్ లో కరెంటు ఉంది అన్నారు. పైగా సమైక్య రాష్ట్రంలో ఆంధ్రాపాలకులు తెలంగాణాను ధ్వంసం చేశారంటూ మండిపడ్డారు. ఆ వ్యాఖ్యలపైనే చంద్రబాబు తాజాగా స్పందించారు. కెసిఆర్ వ్యాఖ్యలు తనను బాగా బాధించినట్లు చెప్పారు. తెలంగాణాను ఆంధ్రాపాలకులు ధ్వంసం చేసారనటంపై చంద్రబాబు అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. 1995కు ముందు..తర్వాత హైదరాబాద్ అభివృద్ధిని గమనిస్తే వాస్తవాలు తెలుస్తాయన్నారు.

విభజనలో యుపిఏ ప్రభుత్వం చేసిన అన్యాయం వల్లే ఏపి ఈ పరిస్దితికి వచ్చిందని మండిపడ్డారు. దక్షిణాది రాష్ట్రాల్లో తలసరి ఆదాయంలో అట్టడుగున్న ఉన్నది ఏపి మాత్రమేనంటూ వాపోయారు. ఇంకా రూ. 35 వేల ఆదాయం పెరిగితేనే పొరుగు రాష్ట్రాలతో సమానస్ధాయికి చేరుకోగలమని చంద్రబాబు చెప్పారు. కేంద్రసాయం విషయంలో రాజీలేని పోరాటం కొనసాగుతుందన్నారు. అప్పటికేదో మూడున్నరేళ్ళల్లో కేంద్రంపై పోరాటం చేస్తున్నట్లు బిల్డప్ ఇచ్చారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకునేందుకు అవసరమైతే సుప్రింకోర్టుకైనా వెళతామని స్పష్టం చేశారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios