కర్ణాటకలో రాజకీయాలు దారుణంగా మారాయని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. బీజేపీ వ్యవహరిస్తున్న తీరు చాలా దారుణమన్నారు. మెజారిటీ లేకున్నా.. అధికారం కోసం బీజేపీ కుట్రలు పన్నుతోందని విమర్శించారు.ఇప్పటికే తమిళనాడులో కుట్ర చేశారని.. ఇప్పుడు కర్ణాటకలో కుయుక్తులు పన్నుతున్నారని మండిపడ్డారు.

ప్రస్తుతం కేంద్రం చూపు ఏపీపైనే ఉందన్నారు. శాంతి భద్రతల విషయంలో ఏపీలో కుట్రలు చేస్తే మక్కెలు విరగకొడతానని ఆయన హెచ్చరించారు. ఎన్నికలకు ముందు మోదీ, అమిత్ షా చెప్పింది ఒకటని.. ఇప్పుడు చేసేది ఇంకొకటన్నారు. అప్రజాస్వామ్య విధానాలు అవలంభిస్తూ... దేశానికి ఏం సంకేతాలిస్తున్నారని ప్రశ్నించారు.  కర్ణాటక పరిణామాలపై వైసీపీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.