అర్ధంకాని చంద్రబాబు వైఖరి

అర్ధంకాని చంద్రబాబు వైఖరి

చంద్రబాబునాయుడు వైఖరి విచిత్రంగా ఉంది. ఏపికి కేంద్రం అన్యాయం చేసిందంటారు. కేంద్ర ప్రభుత్వంలో నుండి బయటకు మాత్రం బయటకురారు. కేంద్రం ఏపి ప్రజలను వంచిస్తోందని మండిపడతారు. కేంద్రంలోని తన మంత్రుల చేత రాజీనామా చేయించరు. ఏపికి న్యాయం జరిగే వరకూ కేంద్రంపై పోరాటం ఆపేది లేదంటారు. తమ ఎంపిలతో రాజీనామా చేయించే విషయం మాత్రం మాట్లాడారు. చివరి బడ్జెట్లో కూడా ఏపికి అన్యాయం చేసారని ఎంపిలతో మాట్లాడిస్తారు. బిజెపితో పొత్తు విషయం మాత్రం తేల్చరు.

మొత్తానికి అటు పార్లమెంటు వేదికగా అటు ఎంపిలతోనూ ఇటు విజయవాడలో సమీక్షలతొను చంద్రబాబు ఏకకాలంలో నాటకాన్ని బాగా రక్తికట్టిస్తున్నారు. ఆదివారం నాడు కూడా జరిగిందదే. ఉదయం చంద్రబాబునాయుడు అధ్యక్షతన అందుబాటులో ఉన్న ఎంపిలు, మంత్రులు సమీక్ష జరిగింది.

కేంద్రం ప్రభుత్వం తరపున బిజెపి ఎంపి కంభంపాటి హరిబాబు శనివారం ఉదయం పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. అందులో గడచిన మూడున్నరేళ్ళుగా కేంద్రం ఏపికి చేసిన సాయంపై సుదీర్ఘ వివరణ ఇచ్చారు. హరిబాబు వివరణ ఆధారంగా రాష్ట్రంలోని బిజెపి నేతలు చంద్రబాబునాయుడుపై వరుసబెట్టి దాడులు మొదలుపెట్టారు.

వారి దాడులకు జవాబన్నట్లుగా ఆదివారం మధ్యాహ్నం టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు, ఎంపిలు గల్లా జయదేవ్, రామ్మనోహర్ నాయుడు కేంద్రంపై ఎదురుదాడి మొదలుపెట్టారు. తర్వాత కళా వెంకట్రావు మీడియాతో మాట్లాడుతూ, గడచిన మూడున్నరేళ్ళుగా కేంద్రం నుండి ప్రత్యేకంగా ఏపికంటూ వచ్చిందేమీ లేదన్నారు. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన సాయమేదీ అందలేదని మండిపడ్డారు. దేశానికంతా వర్తించే బడ్జెట్లో ఏపికి కూడా సాయం చేశామని కేంద్రం చెప్పటం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా, ప్రత్యేక రైల్వేజోన్ ఇచ్చితీరాల్సిందేనని డిమాండ్ చేశారు. ఏపికి ఇచ్చిన హామీలు నెరవేరేవరకూ టిడిపి పోరాడుతూనే ఉంటుందని స్పష్టం చేశారు.

గల్లా జయదేవ్ మాట్లాడుతూ, టిడిపి లేవనెత్తిన డిమాండ్లకు జాతీయస్ధాయిలో మద్దతు వచ్చిందన్నారు. పార్లమెంటులోని మిత్రపక్షాలే కాకుండా ప్రతిపక్షాలు కూడా మద్దతుగా నిలిచినట్లు తెలిపారు. ఏపి తలసరి ఆదాయం చాలా తక్కువగా ఉంది కాబట్టి ఇతర రాష్ట్రాలతో సమానంగా ఎదిగేవరకూ కేంద్రం సాయం చేయాల్సిందేనన్నారు. తప్పుడు లెక్కలతో కేంద్రం ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నట్లు జయదేవ్ మండిపడ్డారు.

 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM Andhra Pradesh

Next page