మీరు రాజీనామాలు చేస్తే మేం రెడీ: విశాఖలో వైసీపీకి బాబు సవాల్
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ప్రజా ప్రతినిధులు రాజీనామాలు చేస్తే తాము కూడా రాజీనామా చేస్తామని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ప్రకటించారు.
విశాఖపట్టణం: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ప్రజా ప్రతినిధులు రాజీనామాలు చేస్తే తాము కూడా రాజీనామా చేస్తామని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ప్రకటించారు.
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను నిరసిస్తూ ఆమరణ నిరహార దీక్ష చేస్తున్న గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును కిమ్స్ ఆసుపత్రిలో చంద్రబాబునాయుడు మంగళశారం నాడు పరామర్శించారు.ఈ సందర్భంగా ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.
రాజీనామాలు చేయడం తమకు ఒక్క నిమిషం పని ఆయన స్పష్టం చేశారు. విశాఖకు ఇలాంటి పరిస్థితి వస్తోందని తాను ఏనాడు ఊహించలేదన్నారు.
రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వం ముందుకు వస్తే తాము కూడ కలిసి వస్తామని ఆయన స్పష్టం చేశారు.
ఏపీ కోసం అన్నింటికి అతీతంగా తాము నిలబడతామన్నారు. మనమంతా ఒక్కటైతే స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవచ్చని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. ప్రజల భావోద్వేగాలను ప్రభుత్వం తెలుసుకోవాలని ఆయన హితవు పలికారు.
also read:అచ్చెన్నాయుడు అందుకే హీరో: జగన్ పై బాబు ఫైర్
రేపు విశాఖకు జగన్ వస్తాడంట... నేరుగా దొంగస్వామి వద్దకు వెళ్లి వంగి వంగి దండాలు పెడతారని ఆయన సెటైర్లు వేశారు. పోస్కో ఒప్పందం గురించి జగన్ ఎందుకు నోరు మెదపడం లేదని ఆయన ప్రశ్నించారు. బాబాయ్ హత్య జరిగితే ఇంత వరకు ఎందుకు ఆ విషయం గురించి మాట్లాడడం లేదన్నారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య విషయంలో నిజాలను తేల్చాలని కోరుతూ ఆయన కూతురు కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించిందన్నారు. అయితే ఈ విచారణ జరగకుండా మూడు రోజులకోసారి ఢిల్లీకి వెళ్లి జగన్ అడ్డుకొంటున్నారని ఆయన విమర్శించారు.