వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పై దాడి కేసులో టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ను ఏ1 నిందితుడిగా చేరుస్తూ.. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

ఈ నెల రెండో తేదీన విజయనగరం జిల్లా రామతీర్థం పర్యటనకు వచ్చిన విజయసాయిరెడ్డి.. జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలపై టీడీపీ నేతలు దాడి చేసిన సంగతి తెలిసిందే. దీనిపై అదే రోజు విజయసాయిరెడ్డి నెల్లిమర్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దాడికి బాధ్యులుగా టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ అధ్యక్షుడు కళా వెంకట్రావును పేర్కొన్నారు. ప్రాథమిక విచారణ అనంతరం పోలీసులు ఈ ముగ్గురిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.