టీడీపీ గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం ఇంచార్జీగా కోవెలమూడి రవీంద్ర(నానీ)  చంద్రబాబునాయుడు నియమించారు. సోమవారం నాడు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరి ఏపీ సీఎం వైఎస్ జగన్ ను కలిశారు. గిరి టీడీపీని వీడి వైసీపీలో చేరాలని నిర్ణయం తీసుకొన్నారు. దీంతో చంద్రబాబునాయుడు ఈ నిర్ణయం తీసుకొన్నారు.

2019 ఎన్నికల్లో మద్దాలి గిరి టీడీపీ అభ్యర్ధిగా గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసి విజయం సాధించారు. మద్దాలి గిరి కూడ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బాటలోనే పయనించాలని నిర్ణయం తీసుకొన్న నేపథ్యంలో  గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కొత్త ఇంచార్జీని నియమించారు చంద్రబాబునాయుడు.

Also read:నియోజకవర్గం కోసమే: జగన్‌తో భేటీపై మద్దాలిగిరి వ్యాఖ్యలు

గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఆలపాటి రాజా పశ్చిమ నియోజకవర్గానికి చెందిన కొందరు నేతలతో కలిసి సోమవారం నాడు చంద్రబాబునాయుడుతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కోవెలమూడి రవీంద్రను ఇంచార్జీగా నియమిస్తున్నట్టుగా చంద్రబాబు ప్రకటించారు.

Also Read:బాబుకు షాక్: వైసీపీలో చేరనున్న టీడీపీ ఎమ్మెల్యే మద్దాలిగిరి, క్యూలో మరికొందరు..?

టీడీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేల్లో మరికొందరు ఎమ్మెల్యేలు కూడ వైసీపీలో లేదా బీజేపీలో చేరే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. తన బాటలోనే మరికొందరు ఎమ్మెల్యేలు కూడ పార్టీని వీడుతారని మద్దాలి గిరి ప్రకటించారు.  

దీంతో మరికొందరు టీడీపీ ఎమ్మెల్యేలు త్వరలోనే పార్టీని వీడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే రాజకీయంగా తమను దెబ్బతీసేందుకు వైసీపీ మైండ్ గేమ్ ఆడుతోందని టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు.