ఏం చేయలేరు: బిజెపి నేతలకు చంద్రబాబు కౌంటర్

ఏం చేయలేరు: బిజెపి నేతలకు చంద్రబాబు కౌంటర్

ఒంగోలు: తమ పార్టీపై బిజెపి నేతలు చేస్తున్న విమర్శలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కౌంటర్ ఇచ్చారు. తమ తెలుగుదేశం పార్టీని ఎవరు దెబ్బ తీయాలని చూసినా వారే దెబ్బ తింటారని, తమ పార్టీని ఎవరూ ఏమీ చేయలేరని ఆయన అన్నారు. 

ప్రకాశం జిల్లాలో గురువారం నీరు - ప్రగతి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి మేలు జరుగుతుందనే ఉద్దేశంతోనే బిజెపితో పొత్తు పెట్టుకున్నామని, నాలుగేళ్ల తర్వాత అన్యాయం చేసిందని, లోటు బడ్జెట్ ను కూడా ఎగ్గొడుతున్నారని ాయన అన్నారు. 

నీతీనిజాయితీ లేకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. ప్రతి శుక్రవారం కోర్టు వెళ్లే నేత తనను విమర్శిస్తున్నాడని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ను ఉద్దేశించి అన్నారు. ప్రతిపక్షాలు అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని అన్నారు. 

వెలిగొండ ప్రాజెక్టును ఏడాదిలోగా పూర్తి చేస్తామని చంద్రబాబు చెప్పారు. జిల్లాలోని పెండింగ్‌ ప్రాజెక్టులను వేగంగా పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. గోదావరి జలాలను పెన్నాకు తీసుకువెళ్లాలని ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. వైకుంఠపురం దగ్గర బ్యారేజీ కట్టి సాగర్‌ కుడికాలువకు నీళ్లు ఇస్తామని కూడా చంద్రబాబు హామీ ఇచ్చారు. నిబంధనలు సడలించి రామాయపట్నం పోర్టు కడుతామని ఆయన చెప్పారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos