కృష్ణా జిల్లా: ఐనంపూడికి బయలుదేరిన టీడీపీ నేతలను పామర్రు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దళితులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో దళితులను పరామర్శించేందుకు టీడీపీ నేతలు ఛలో ఐనంపూడి కార్యక్రమానికి బయలుదేరారు. వర్ల రామయ్య ఆధ్వర్యంలో విజయవాడ నుంచి టీడీపీ, దళితనేతలు బయలుదేరారు. మైలవరం, రెడ్డిగూడెం మండలం వద్ద వారిని పోలీసులు అడ్డుకున్నారు. వెనక్కి వెళ్లాలంటూ పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఘటనకు కారణమైన వారిని అరెస్ట్ చేసేవరకు వెనక్కి వెళ్లేదిలేదని వర్ల రామయ్య స్పష్టం చేశారు. నిందితులను అరెస్టు చేయాలనడం తప్పా? ప్రతిపక్షంగా తమ బాధ్యతని రామయ్య అన్నారు.

వీడియో

"