అమరావతి: ఆంధ్రప్రదేశ్ స్కిల్ డవలప్ మెంట్ చైర్మన్ గా చల్లా మధుసూదన్ రెడ్డి నియమితులయ్యారు. చల్లా మధుసూదన్ రెడ్డిని స్కిల్ డవలప్ మెంట్ చైర్మన్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

చల్లా మధుసూదన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. వైసీపీ ఆవిర్భావం నుంచి చల్లా మధుసూదన్ రెడ్డి పార్టీ బలోపేతం కోసం కృషి చేశారు.  పార్టీ క్షేత్రస్థాయి నుండి సంస్థాగత నిర్మాణంలో క్రియాశీలక పాత్ర పోషించారు. 

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ట్రైనింగ్ కన్వీనర్ గా పనిచేశారు. బూత్ లెవెల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ను విజయవంతంగా నిర్వహించి వైసీపీ విజయంలో కీలక పాత్ర పోషించారు చల్లా. 

ప్రస్తుతం పార్టీలో ఐటీ వింగ్ కి ప్రెసిడెంట్ గా, వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నారు. విదేశాల్లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూ పార్టీ కోసం ఆయన రాష్ట్రానికి వచ్చేశారు. పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. పార్టీకి చల్లా మధుసూదన్ రెడ్డి చేసిన సేవలను గుర్తించిన సీఎం జగన్ ఏ.పి. స్టేట్
 స్కిల్ డెవలప్ మెంట్ చైర్మన్ గా నియమించారు.  

నైపుణ్యం కలిగి ఉండి సరైన ఉపాధి లేని యువత, ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలసవెళ్లే యువత,  నైపుణ్యాభివృద్ధికి సరైన అవకాశాలు లేని యువతకు చేయూతనిచ్చి, వారి నైపుణ్యాలకు తగ్గట్లుగా అందుబాటులోనే ఉపాధి అవకాశాలు కల్పించడమే ఏపీ స్టేట్ స్కిల్ డవలప్ మెంట్ సంస్థ ముఖ్య ఉద్దేశం.  

ప్రజాసంక్షేమ కార్యక్రమాల్లో విస్తృతంగా పనిచేస్తూ, సమాజ అభివృద్ధిపై పరిపూర్ణమైన అవగాహన కలిగివున్న వ్యక్తిగా పార్టీకి అత్యంత విధేయుడుగా చల్లా మధుసూదన్ రెడ్డికి గుర్తింపు ఉంది. చల్లా మధుసూదన్ రెడ్డికి ఏపీ స్టేట్ స్కిల్ డవలప్ మెంట్ చైర్మన్ గా అవకాశం కల్పించడం పట్ల వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.