కృష్ణా జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. పట్టపగలే ఓ వృద్ధురాలిపై ఆమె ఇంట్లోనే దాడిచేసి బంగారు ఎత్తుకెళ్లారు. ఉదయం పూట అందరూ నడిచే దారిలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. 

వివరాల్లోకి వెడితే.. కృష్ణా జిల్లా మైలవరంలోని స్థానిక పొందుగల రోడ్డులో  కోదాటి పాండు రంగమ్మ (69) అనే వృద్ధురాలు నివాసం ఉంటోంది. ఆమె ఉదయం స్నానం చేసి బాత్రూమ్ నుండి ఇంట్లోకి వెళుతుండగా గుర్తు తెలియని వ్యక్తి ఆమె పై దాడి చేశాడు. 

"

వెంటనే అలర్ట్ అయిన ఆమె మెడలోని తాళిని గట్టిగా పట్టుకుని వాడివంక చూసేసరికి దొంగ అని అర్థమయ్యింది. ఆమె పెనుగులాడుతుంటే మెడలో ఉన్న రెండున్నర కాసుల నానతాడు ని తెంపుకొని పారి పోయాడు. 

ఈ ఘర్షణలో ఆమె పెనుగులాడగా సగం తాడు ఆమె చేతిలోకి రాగా మిగిలిన సగభాగంతో నిందితుడు పరారయ్యాడు. గొలుసు కొట్టేశాక వాకింగ్ చేస్తున్నట్టుగా దర్జాగా వెళ్లిపోయాడని బాధితురాలు వాపోతోంది. బాధితురాలి సమాచారం తో సి.ఐ శ్రీను ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేశారు.