Asianet News TeluguAsianet News Telugu

ఏపీ రాష్ట్రానికి రూ.488 కోట్ల హెల్త్‌ గ్రాంట్‌ విడుదల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం నుండి రూ. 488.15 కోట్ల హెల్త్ గ్రాంట్ విడుదలైంది. 9 రాష్ట్రాలకు  ప్రతిపాదనలు అందిన తర్వాత నిధులను విడుదల చేయనున్నట్టుగా కేంద్రం తెలిపింది. తెలంగాణ నుండి ప్రతిపాదనలు అందలేదు. ఈ ప్రతిపాదనలు అందిన తర్వాత తెలంగాణకు కూడా నిధులను విడుదల చేయనుంది కేంద్రం.

Centre releases  Rs. 8,453.92 cr grant to 19 states to strengthen health systems
Author
New Delhi, First Published Nov 14, 2021, 1:09 PM IST

న్యూఢిల్లీ:కేంద్ర ఆర్థికశాఖ ఆంధ్రప్రదేశ్‌కు రూ.488.15 కోట్ల హెల్త్‌ గ్రాంట్‌ విడుదల చేసింది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు 28 రాష్ట్రాలకు కలిపి 2021-22 ఆర్థిక సంవత్సరానికి రూ.13,192 కోట్లు విడుదల చేయాల్సి ఉండగా, ప్రస్తుతం ప్రతిపాదనలు పంపిన 19 రాష్ట్రాలకు రూ.8,453.92 కోట్లు ఇచ్చింది. ఇది ఈ ఏడాది అన్ని రాష్ట్రాలకు కేటాయించిన దాంట్లో 3.7%. Telangana సహా మిగిలిన 9 రాష్ట్రాలకు ప్రతిపాదనలు అందిన తర్వాత నిధులు విడుదల చేస్తామని ఆర్థికశాఖ  విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. 15వ ఆర్థిక సంఘం 2021-22 నుంచి 2025-26 మధ్య కాలానికి దేశంలోని స్థానిక సంస్థలకు రూ.4,27,911 కోట్ల గ్రాంట్‌ సిఫార్సు చేసింది. అందులో 70,051 కోట్లు Health Grant ఇచ్చింది. ఇందులో రూ.43,928 కోట్లు గ్రామీణ స్థానిక సంస్థలు, రూ.26,123 కోట్లు పట్టణ స్థానిక సంస్థల పరిధిలోని వైద్య ఆరోగ్యరంగానికి ఖర్చు చేయాలని సూచించింది. 

also read:ఉపాధి హామీ పథకం బిల్లుల చెల్లింపు: ఏపీ హైకోర్టుకు హాజరైన ఆదిత్యనాథ్ దాస్

మొత్తం గ్రాంట్లలో గ్రామీణ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో రోగ నిర్ధారణ మౌలిక వసతులకు 23.37 % గ్రామీణ ప్రాంతాల్లో బ్లాక్‌ స్థాయి ప్రజారోగ్య కేంద్రాల కోసం 7.53%, ఆరోగ్యకేంద్రాల నిర్మాణానికి 10.23%, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ సెంటర్లుగా మార్చడానికి 21.56%, పట్టణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో రోగ నిర్ధారణ మౌలిక వసతుల కల్పనకు 2.99%, పట్టణ ప్రాంతాల్లో హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ కేంద్రాల ఏర్పాటుకు 34.30% కేటాయించింది.ఐదేళ్లలో ఈ పద్దు కింద Andhra pradesh కి రూ.2,601 కోట్లు దక్కుతుంది. తొలి రెండేళ్లు రూ.490 కోట్ల చొప్పున, మిగిలిన మూడేళ్లు రూ.514 కోట్లు, రూ.540 కోట్లు, రూ.567 కోట్ల మేర రాష్ట్రానికి గ్రాంట్‌ విడుదల కానుంది. ఈ మొత్తాన్ని ఆర్థిక సంఘం ప్రమాణాల మేరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది.

అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి (రూ. 46,944 కోట్లు), అసోం (రూ. 272.2509 కోట్లు), బీహార్ కి( రూ. 1116.3504 కోట్లు), ఛత్తీస్‌ఘ‌డ్‌కి( రూ.338.7944 కోట్లు), హిమాచల్‌ ప్రదేశ్ కి ( రూ. రూ.98.0099 కోట్లు), జార్ఖండ్ లో ( రూ. 444.3983 కోట్లు), కర్టాకకు ( రూ. 551.53 కోట్లు), మధ్యప్రదేశ్ కి (రూ.922.7992 కోట్లు),
మహారాష్ట్రకి (రూ. 778.0069 కోట్లు),మణిపూర్‌కి ( రూ. 42.8771 కోట్లు), మిజోరం ( రూ. 31. 19 కోట్లు), ఒడిశాకి (రూ. 461.7673 కోట్లు), పంజాబ్ కి ( రూ. 399. 6558 కోట్లు), రాజస్థాన్ కి ( రూ.656..171 కోట్లు), సిక్కింకి (రూ 20.978 కోట్లు), తమిళనాడులో (రూ. 805.928 కోట్లు), ఉత్తరాఖండ్ కు ( రూ. 150. 0965 కోట్లు ), బెంగాల్ రాష్ట్రానికి (రూ.328.0694 కోట్లు) కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.


 

Follow Us:
Download App:
  • android
  • ios