Asianet News TeluguAsianet News Telugu

ఉపాధి హామీ పథకం బిల్లుల చెల్లింపు: ఏపీ హైకోర్టుకు హాజరైన ఆదిత్యనాథ్ దాస్


ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  ఆదిత్యనాథ్ దాస్ శుక్రవారం నాడు హాజరయ్యారు.ఉపాధి హామీ పథకం పనుల బిల్లుల చెల్లింపుపై జరిగిన విచారణకు సీఎస్ హాజరయ్యారు.ఈ పిటిషన్లపై ఏపీ హైకోర్టు విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది.

AP Chief secretary adityanath das appears before AP High court
Author
Guntur, First Published Sep 24, 2021, 4:56 PM IST


అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు(AP High court) శుక్రవారం నాడు ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (ap chief secretary) ఆదిత్యనాథ్ దాస్ (adityanath das)హాజరయ్యారు. ఉపాధి హామీ పథకం పనుల బిల్లుల చెల్లింపుపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. తమకు డబ్బులు చెల్లించలేదని దాఖలైన 500 పిటిషన్లపై కోర్టు విచారణ జరిపింది. పిటిషనర్ల తరపు వాదనలు న్యాయవాది నర్రా శ్రీనివాస్‌ (Narra srinivas)వినిపించారు. 

ఉపాధి హామీ పథకం పనులపై విజిలెన్స్ విచారణ జరగడం లేదని కోర్టుకు సీఎస్‌ ఆదిత్యనాథ్ దాస్ చెప్పారు. సీఎస్‌ ఆదిత్యనాథ్ స్టేట్‌మెంట్‌ హైకోర్టు రికార్డు చేసింది. ఏపీలో చేపట్టిన ఉపాధి హామీ పథకం పనులకు మొత్తం డబ్బులు చెల్లించామని కేంద్రం (union government) కోర్టుకు తెలిపింది. 

విచారణ జరుగుతున్నట్టు తమకు నివేదిక లేదని కేంద్రం పేర్కొంది. ఈ నెల 29కి తీర్పును హైకోర్టు రిజర్వ్‌ చేసింది. 29న తుది ఉత్తర్వులు ఉంటాయని జస్టిస్ బట్టు దేవానంద్ స్పష్టం చేసింది.ఉపాధి హామీ పథకం కింద బకాయిలు చెల్లించాలని  హైకోర్టులో పిటిషన్లు  దాఖలయ్యాయి. ఈ విషయమై హైకోర్టు ఆదేశాలను కూడ పాటించలేదని ఐఎఎస్ అధికారులపై గతంలో హైకోర్టు సీరియస్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

Follow Us:
Download App:
  • android
  • ios