Asianet News TeluguAsianet News Telugu

రుణమాఫీ డొల్లతనాన్ని బయటపెట్టిన సర్వే

  • రాష్ట్రంలో జరుగుతున్న రుణమాఫీ డొల్లతనం బయటపడింది. స్వయంగా కేంద్ర ఆర్ధికశాఖ నిర్వహించిన సర్వేలో వాస్తవాలు కళ్ళకు కట్టినట్లు కనపడ్డాయి.
  • చంద్రబాబునాయుడు ఇచ్చిన రుణమాఫీ హామీ పుణ్యమా అని వేలాదిమంది రైతులు బ్యాంకుల దృష్టిలో రుణాలు ఎగొట్టేవారుగా ముద్రవేయించుకున్నారు.
  • వ్యవసాయానికి చేతిలో డబ్బులు లేక, బ్యాంకులు రుణాలివ్వకపోవటంతో రైతులు వేరేదారి లేక వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు.
Central survey reveals facts about loan waiver to farmers

రాష్ట్రంలో జరుగుతున్న రుణమాఫీ డొల్లతనం బయటపెడింది. స్వయంగా కేంద్ర ఆర్ధికశాఖ నిర్వహించిన సర్వేలో వాస్తవాలు కళ్ళకు కట్టినట్లు కనపడ్డాయి. చంద్రబాబునాయుడు ఇచ్చిన రుణమాఫీ హామీ పుణ్యమా అని వేలాదిమంది రైతులు బ్యాంకుల దృష్టిలో రుణాలు ఎగొట్టేవారుగా ముద్రవేయించుకున్నారు.

తాను అధికారంలోకి రాగానే రుణమాఫీ చేస్తానంటూ చంద్రబాబు పోయిన ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. హామీని నమ్మి రైతులందరూ టిడిపికి ఓట్లు వేసారు. అయితే, అదికారంలోకి రాగానే రుణమాఫీకి చంద్రబాబు అనేక పరిమితులు పెట్టారు. విడతల వారీగా రుణాలను మాఫీ చేయటం అందులో ప్రధానమైనది. ఇక్కడే చంద్రబాబు ఓ మెలిక కుడా పెట్టారు. తాను హామీ ఇచ్చిన రోజుకు ఎంతెంత రుణాలైతే ఉన్నాయో వాటిని మాత్రమే మాఫీ చేస్తానని చెప్పారు.

అయితే, ఇక్కడే సమస్య మొదలైంది. చంద్రబాబు హామీని నమ్ముకున్న రైతులు రుణాలను చెల్లించటం మానుకున్నారు. దాంతో అసలు, వడ్డీలు కలిపి చెల్లించాల్సిన రుణం బాగా పెరిగిపోయాయి. అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రుణాలను ఒకేసారి కాకుండా విడతల వారీగా బ్యాంకుల్లో జమచేస్తానని  చెప్పారు. ప్రభుత్వం చెల్లించిన వాయిదాలు రైతులు కట్టాల్సిన వడ్డీలకే సరిపోలేదు. ఇక అసలు ఎప్పటికి తీరాలి. అంటే అటు అసలు తీరక, ఇటు వడ్డీలు చెల్లించలేక పోవటంతో రైతులను బ్యాంకులు ‘రుణాల ఎగవేతదారులు’గా ముద్రవేసి అప్పులివ్వటం మానేసింది.

వ్యవసాయానికి చేతిలో డబ్బులు లేక, బ్యాంకులు రుణాలివ్వకపోవటంతో రైతులు వేరేదారి లేక వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. వాళ్ళేమో రైతులను పిండేస్తున్నారు.  అదే విషయాన్ని కేంద్ర సర్వే స్పష్టంగా బయటపెట్టింది. 2016–17లో రాష్ట్ర రైతులు తీసుకున్న మొత్తం అప్పు రూ.32,377 కోట్లు. ఇందులో సన్న, చిన్నకారు రైతుల అప్పే రూ.25,872 కోట్లు. దాంతో చంద్రబాబు చెబుతున్న రైతు రుణమాఫీ ఒట్టి డొల్ల అని తేలింది. మరోపక్క గత ఆర్థిక సంవత్సరంలో తలసరి ఆదాయం వృద్ధిలో, స్థూల ఉత్పత్తి పెరుగుదలలో రాష్ట్రం తిరోగమనంలో ఉన్నట్లు కుడా సర్వే వెల్లడించింది.

Follow Us:
Download App:
  • android
  • ios