ఇప్పటికే రూ3,300 కోట్లు విడుదల చేసామన్న కేంద్రం రాజ్యసభలో పోలవరంపై  ప్రశ్నలు లేవనెత్తిన  ఎంపీ విజయసాయిరెడ్డి 



పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం త్వరలో మరో వెయ్యి కోట్లు అందించనుంది. ఇప్పటికే రూ3,300 కోట్లు విడుదల చేసిన చేసింది కేంద్రం. ఈ విషయాన్ని రాజ్యసభలో కేంద్ర మంత్రి సంజయ్‌ బల్యాన్‌ తెలిపారు. 
పోలవరంపై జరిగిన చర్చలో ఎంపీ విజయసాయిరెడ్డి లేవనెత్తిన ప్రశ్నలకు, కేంద్ర ప్రభుత్వం తరపున ఆయన సమాదానాలిచ్చారు. 
2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం గిరిజన భాదితులకు భూమి ఇవ్వాలని.. ప్రతి కుటుంబానికి ఉద్యోగం ఇవ్వాలని విజయసాయిరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
దీనిపై మంత్రి సమాదానమిస్తూ ప్రాజెక్టు భాదితుల కోసమే రూ.9,800 కోట్లు ఖర్చు చేసినట్టు లెలిపారు. 28,557 భాదిత కుటుంబాలను వేరే ప్రాంతాలకు తరలించి, పునరావాసం కల్పించామన్నారు.
ఒడిషాకు చెందిన బీజేడీ ఎంపీ నరేంద్రకుమార్‌ స్వాన్‌ మాట్లాడుతూ పోలవరం అంశం కోర్టులో ఉండగా ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. పోలవరంపై కోర్టులో ఎటువంటి స్టే లేదని,ఒడిశాపై ఏదైనా పర్యావరణ ప్రభావాలు,నిర్వాసితులు ఉంటే వాటికయ్యే ఖర్చు కేంద్రమే భరిస్తుందని మంత్రి తెలిపారు.
నీతి ఆయోగ్‌ సిఫారసు మేరకే నిర్మాణ బాధ్యతలను రాష్ట్రానికి అప్పగించామని మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రివైజ్డ్‌ ఎస్టిమేట్స్‌ తయారుచేస్తోందని, వారు చేసే ప్రతిపాదనలనుబట్టి కేంద్రం స్పందిస్తుందని సంజయ్‌ బల్యాన్‌ తెలిపారు.