న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రం షాక్ ఇచ్చింది. పోలవరం విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి కేంద్రం షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. 

పర్యావరణ అనుమతుల్ని ఉల్లంఘినట్లు కేంద్రం స్పష్టం చేస్తూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పర్యావరణ అనుమతులు ఎందుకు రద్దు చేయకూడదని ప్రశ్నించింది.  పురుషోత్తపట్నం ప్రాజెక్టుపై కూడా కేంద్రం వివరణ కోరింది. 

ప్రాజెక్టు నిర్మాణంలో పర్యావరణ అనుమతుల్ని ఉల్లంఘించారంటూ చెన్నై పర్యావరణ శాఖ అధికారులు కేంద్రానికి నివేదిక సమర్పించారు. దాంతో పోలవరం, దాని అనుబంధ ప్రాజెక్టులపై కేంద్ర పర్యావరణ శాఖ తనిఖీలు నిర్వహించింది.

2005లో నాటి పర్యావరణ అనుమతుల్ని ఉల్లంఘించినట్లు కేంద్రం నిర్థారించింది. ఇటీవలే స్టాప్‌వర్క్ ఆర్డర్లపై స్టేను కేంద్రం రెండేళ్లు పొడిగించింది. ఇంతలోనే అనూహ్యంగా షోకాజ్ నోటీసులు జారీ కావడం చర్చకు దారి తీసింది.