Asianet News TeluguAsianet News Telugu

ఎంపీ లాడ్స్ నిధుల దుర్వినియోగం.. వివరణ ఇవ్వని ఏపీ సర్కార్, కేంద్రం ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై (ap govt) కేంద్రం సీరియస్ అయ్యింది.  ఎంపీ లాడ్స్ నిధులు (mp lads) దుర్వినియోగంపై ఇంతవరకు సమాధానమివ్వకపోవడంపై కేంద్రం అసహనం వ్యక్తం చేస్తోంది. ఎంపీ లాడ్స్ నిధులను చర్చిల నిర్మాణం (church construction) కోసం ఖర్చు చేయడంపై వెంటనే నివేదిక పంపాలని గతంలో ఏపీ ప్రభుత్వానికి కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. 

center serious on ap govt over sought clarification on complaints that mp lads funds
Author
Amaravati, First Published Nov 27, 2021, 4:05 PM IST

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై (ap govt) కేంద్రం సీరియస్ అయ్యింది.  ఎంపీ లాడ్స్ నిధులు (mp lads) దుర్వినియోగంపై ఇంతవరకు సమాధానమివ్వకపోవడంపై కేంద్రం అసహనం వ్యక్తం చేస్తోంది. ఎంపీ లాడ్స్ నిధులను చర్చిల నిర్మాణం (church construction) కోసం ఖర్చు చేయడంపై వెంటనే నివేదిక పంపాలని గతంలో ఏపీ ప్రభుత్వానికి కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. వైసీపీ ఎంపీ నందిగాం సురేష్ (nandigam suresh) ఒక చర్చి నిర్మాణానికి 40 లక్షల పైగా నిధులు ఇచ్చినట్లు మీడియా కథనాలతో సహా ప్రధానికి లేఖ రాశారు ఎంపీ రఘురామకృష్ణరాజు (raghu rama krishnam raju).  దీనిపై సమగ్ర నివేదిక పంపాలంటూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి కి లేఖలు పంపింది కేంద్రం. కానీ దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి స్పందనను కేంద్రానికి తెలియకజేయకపోవడంపై కేంద్ర సర్కార్ సీరియస్ అయ్యింది. 

Also Read:ఈ మంత్రులను వైఎస్ జగన్ జగన్‌ మార్చలేరు.. రఘరామ కృష్ణరాజు సంచల వ్యాఖ్యలు..

ఎంపీలకు కేంద్ర ప్రభుత్వం నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులను కేటాయిస్తుంది. ప్రతి ఏడాది ఈ నిధులను ఎంపీలు తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనుల కోసం కేటాయించవచ్చు. అయితే ఈ నిధులను ఉపయోగించాలంటే కొన్ని నిబంధనలు పాటించాల్సి వుంటుంది. అభివృద్ధి పేరుతో చర్చిల నిర్మాణానికి ఇవ్వకూడదని... ఇలా బాపట్ల నియోజకవర్గంలో ఎంపీ చర్చిల నిర్మాణానికి ఎంపీ లాడ్స్ ఇచ్చారని రఘురామకృష్ణరాజు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. 

ఎంపీ లాడ్స్ నిధులు మత సంస్థలకు ఖర్చు చేయరాదని..మత సంస్థల పునర్నిర్మాణం, మరమ్మతుకూ వాడకూడదని స్పష్టమైన నిబంధనలు ఉన్నాయని కేంద్ర గణాంక శాఖ స్పష్టం చేసింది. ఇలా ఖర్చు చేసి ఉన్నట్లయితే సదరు ఎంపీపై చర్యలు తీసుకుని నిధులను రికవరీ చేసే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే వివరణను బట్టి తదుపరి కేంద్రం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్రంలో చర్చిలకు ప్రభుత్వ పరంగా నిధులు ఖర్చు పెడుతున్నారని కొంత కాలంగా విపక్ష పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయి. ఈ క్రమంలో రఘురామకృష్ణ రాజు ఫిర్యాదుపై కేంద్రం స్పందించడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశం అయింది. 

ఎంపీ లాడ్స్ నిధులు నేరుగా ఎంపీ ఖాతాకు జమ కావు... రాష్ట్ర ప్రణాళిక విభాగం తరపున మంజూరు అవుతాయి. ఈ కారణంగా రఘురామ ఫిర్యాదు మేరకు ప్రధాన మంత్రి కార్యాలయం స్పందించి రాష్ట్ర ప్రణాళికా విభాగం ముఖ్యకార్యదర్శికి లేఖ పంపింది. ఎంపీలకు కేటాయించిన నిధులతో బాపట్లలో చర్చికి రూ.86 లక్షలు ఖర్చు చేశారన్న ఫిర్యాదుపై పూర్తి స్థాయి వివరాలు పంపాలని ఆదేశించింది. చాలాచోట్ల ఇదే తరహాలో ఖర్చు చేశారని ఎంపీ రఘురామ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో రాష్ట్ర స్థాయి నోడల్ విభాగం, జిల్లా అధికారులనూ ఈ అంశంపై వివరణ అడిగింది. 

Follow Us:
Download App:
  • android
  • ios