ఈ మంత్రులను వైఎస్ జగన్ జగన్ మార్చలేరు.. రఘరామ కృష్ణరాజు సంచల వ్యాఖ్యలు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (CM YS Jagan) మంత్రి వర్గాన్ని మార్చలేరని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు (Raghu Rama Krishnam Raju) సంచల వ్యాఖ్యలు చేశారు. తనకున్న సమాచారం ప్రకారమే ఈ మాట చెబుతున్నానని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (CM YS Jagan) మంత్రి వర్గాన్ని మార్చలేరని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు (Raghu Rama Krishnam Raju) సంచల వ్యాఖ్యలు చేశారు. తనకున్న సమాచారం ప్రకారమే ఈ మాట చెబుతున్నానని అన్నారు. ప్రస్తుతం ఉన్న మంత్రివర్గంలో బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి వంటి పెద్దవాళ్లు ఉన్నారు.. వాళ్లను తప్పించడం తమాషానా..? అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అందుకే జగన్ మంత్రులను తొలగించే సాహసం చేయకపోవచ్చని భావిస్తున్నట్టుగా చెప్పారు. బుధవారం రఘురామకృష్ణరాజు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన తెలుగు రాష్ట్రాల ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
Also read: ఏపీలో అగ్రవర్ణ పేదలకు ప్రత్యేక సంక్షేమ శాఖ.. జీవో జారీ చేసిన జగన్ సర్కార్
ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నోటికిచ్చినట్టుగా మాట్లాడిన మాటలు.. మూడు ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టేలా ఉన్నాయని మండిపడ్డారు. పాదయాత్ర చేస్తున్న అమరావతి ప్రాంత రైతులను ఉద్దేశించి సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజద్రోహం కిందకి వస్తాయని అన్నారు. అమరావతి రైతుల పాదయాత్రకు వస్తున్న ఆదరణను చూసిన ప్రభుత్వ వర్గాలు భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. గతంలో రాజధాని అమరావతి ఉంటుందని చెప్పలేదా..? అని ప్రశ్నించారు. విశాఖపట్టణం రాజధానిగా ఉండాలని ఉత్తరాంధ్ర ప్రజలు కోరుకోవడం లేదని అన్నారు. విశాఖలో స్థలాల దోపిడి భారీగా జరుగుతుందని ఆరోపించారు. అమరావతి రైతులు పాదయాత్రకు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మద్దుతు తెలియజేయడం చాలా సంతోషమని అన్నారు.
ఇక, న్యాయవ్యవస్థను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన నిందితుడు పంచ్ ప్రభాకర్‌ను 10 రోజుల్లో అరెస్ట్ చేయాలని హైకోర్టు సీబీఐని ఆదేశించడంపై కూడా రఘరామ స్పందించారు. సజ్జల రామకృష్ణ ఆదేశాల మేరకే పంచ్ ప్రభాకర్ మాట్లాడుతున్నారని ఆరోపించారు. హైకోర్టు ఆదేశాలను సీబీఐ పాటించకపోవడం న్యాయవ్యవస్థను అవమానించడమేనని వ్యాఖ్యానించారు. పంచ్ ప్రభాకర్ పోస్టులు సోషల్ మీడియాలో ఇంకా కనిపిస్తున్నాయని అన్నారు. కేసుల నుంచి తప్పించుకోవడానికి పంచ్ ప్రభాకర్ మానసిక రోగిలా నటిస్తున్నారా..? అని అనుమానం వ్యక్తం చేశారు. మానసిక రోగి అయితే వెంటనే ఆస్పత్రిలో చేర్పించాలని అన్నారు. ఒకవేళ నటిస్తే.. అతను ఎక్కడ ఉన్నా సరే అరెస్ట్ చేయాలని కోరారు.
ఏపీలో భారీ మెజారిటీ అధికారం చేపట్టిన వైఎస్ జగన్.. మంత్రల పదవీకాలం రెండున్నరేళ్లనని గతంలోనే సీఎం జగన్ మంత్రులకు చెప్పిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మార్పులు ఉంటాయని సంకేతాలు ఇచ్చారు. అయితే జగన్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు కావస్తున్న నేపథ్యంలో.. ఏపీలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. ఇప్పుడున్న వారి స్థానంలో కొత్త వారిని నియమించే అవకాశం ఉందని జోరుగా చర్చ సాగుతుంది. ఈ క్రమంలోనే మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్న పలువురు నేతలు సీఎంను ప్రసన్నం చేసుకోవడానికి ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. ఈ క్రమంలో రఘరామ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.