కాపు రిజర్వేషన్ చెల్లదు: చంద్రబాబుకు షాక్

First Published 15, Feb 2018, 7:29 AM IST
Center rejects kapu reservation quota bill sent by chandrababu government
Highlights
  • కాపులకు రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చెల్లదంటూ కేంద్రం తేల్చేసింది.

చంద్రబాబునాయుడుకు కేంద్రప్రభుత్వం పెద్ద షాక్ ఇచ్చింది. కాపు రిజర్వేషన్ కోటా ప్రయత్నాలకు బ్రేక్ లు వేసేసింది. సుప్రింకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఏపిలో ఇప్పటికే రిజర్వేషన్ 50 శాతం దాటిపోయింది కాబట్టి కాపులకు రిజర్వేషన్ కల్పించాలని రాష్ట్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చెల్లదంటూ తేల్చిచెప్పింది. కాపులకు 5 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ బిసిల్లో చేర్పించాలని మంత్రివర్గం ఆమోదించిన సంగతి అందరికీ తెలిసిందే. తర్వాత అదే బిల్లును అసెంబ్లీలో కూడా ప్రవేశపెట్టి సభ ఆమోదం కూడా వేయించుకున్నారు.

తర్వాత అక్కడి నుండి బిల్లును కేంద్రం ఆమోదం కోసం చంద్రబాబునాయుడు ఢిల్లీకి పంపారు. ప్రస్తుతం బిల్లు హోంశాఖ పరిశీలనలో ఉంది. కేంద్రం వద్ద ఆ బిల్లు ఎట్టి పరిస్ధితుల్లోనూ ఆమోదం పొందదని చంద్రబాబుకు కూడా తెలుసు. అయినా రాజకీయ అవసరాలను దృష్టిలో పెట్టుకుని డ్రామాలాడుతున్నారు. కాపులను బిసిల్లో చేరుస్తానన్నది పోయిన ఎన్నికలపుడు చంద్రబాబిచ్చిన హామీ.

అధికారంలోకి వచ్చిన తర్వాత హామీని మరచిపోయారు. దాంతో పెద్ద ఆందోళనలే జరిగటం, మంజూనాధ కమీషన్ వేయటం, ఏడాదిన్న తర్వాత కమీషన్ రిపోర్టు ఇవ్వటం అందరికీ తెలిసిందే.  ఆ రిపోర్టునే హడావుడిగా మంత్రివర్గంలో తీర్మానం యించి అసెంబ్లీలో బిల్లు ఆమోదింప చేసుకుని ఢిల్లీకి పంపారు. 

ప్రస్తుతం హోంశాఖ పరిశీలనలో ఉన్న బిల్లును డివోపిటి (కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ) నిలిపేసింది. రిజర్వేషన్ల శాతం 50 దాటిపోయింది కాబట్టి ఏపిలో కాపులకే బిసి రిజర్వేషన్లో చేర్చటం సాధ్యం కాదని తేల్చేసింది. రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలంటూ చంద్రబాబు కోరినా సాధ్యం కాదని కేంద్రం తేల్చేసింది. మొత్తానికి రాజకీయంగా లబ్దిపొందుదామని చంద్రబాబు చేసిన ప్రయత్నాలను కేంద్రం అడ్డుకుంది.

loader