చంద్రబాబుకు కేంద్రం మరో షాక్

చంద్రబాబుకు కేంద్రం మరో షాక్

చంద్రబాబునాయుడుకు కేంద్రం షాకుల మీద షాకులిస్తోంది. ఫిబ్రవరిలో కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ తో మొదలైన రాజకీయ హీట్ కేంద్రం నుండి టిడిపి మంత్రుల రాజీనామాల నిర్ణయంతో తీవ్రస్ధాయికి చేరుకుంది. ఇటువంటి నేపధ్యంలోనే చంద్రబాబు ప్రభుత్వానికి కేంద్రం ఇచ్చిన మరో షాక్ వెలుగు చూసింది.  విశాఖపట్నంలోని గంగవరంలో నిర్మించాలని అనుకున్న రీగ్యాసిఫైడ్ లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఆర్ఎన్ఎల్జి) టెర్మినల్ ను రద్దు చేసింది.

టెర్మినల్ ఏర్పాటు ప్రతిపాదనను కేంద్రం ఉపసంహరించుకున్నట్లు బుధవారం కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్ ప్రకటించారు. కేంద్రం చేసిన తాజా ప్రకటనతో చంద్రబాబుకు పెద్ద షాకే తగిలింది. గంగవరం పోర్టు లిమిటెడ్ కు పెట్రోనెట్ ఎల్ఎన్జీకి మధ్య ఏటా 5 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్ధ్యంతో టెర్మినల్ ఏర్పాటు చేయాలని గతంలో నిర్ణయించినట్లు మంత్రి చెప్పారు.

అయితే అంతే స్ధాయిలో గ్యాస్ కొనుగోలుకు కొనుగోలుదారుల నుండి స్పష్టమైన ఆర్డర్లు రాలేదన్నారు. అదే సమయంలో పైప్ లైన్ ద్వారా గ్యాస్ సరఫరాపైన కూడా స్పష్టత రాకపోవటం కూడా ఇంకో కారణంగా తెలిపారు. ఒకవేళ ఆర్ఎన్ఎల్జీ గనుక ఏర్పాటై ఉంటే భారీ ఎత్తున పెట్టుబడులు వచ్చేవి. అంతేకాకుండా స్ధానికులు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలూ దక్కేవనటంలో సందేహం లేదు. రాష్ట్రానికి మంజూరు చేసిన ఒక్కో ఒక్క సంస్ధను కేంద్రం ఉపసంహరించుకోవటం విచిత్రంగా ఉంది.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM Andhra Pradesh

Next page