కేంద్ర ఒకందుకు నిధులిస్తే, రాష్ట్రప్రభుత్వం మరొకందకు వ్యయం చేసేసింది. దాంతో లెక్కలు తేల్చటానికి నానా అవస్తలు పడుతోంది.
రాష్ట్రానికి వివిధ పద్దుల క్రింది ఇచ్చిన నిధుల వ్యయానికి సంబంధించి కేంద్రం ప్రతిరూపాయికీ లెక్కలు చెప్పాల్పిందేనంటోంది. కారణాలు ఏమైనా గానీ తానిచ్చిన ప్రతీ రూపాయకి రాష్ట్రం లెక్కలు చెప్పాల్సిందేనంటూ గట్టిగా పట్టుబడుతోంది కేంద్రం. గడచిన రెండేళ్లలో రాజధానిలో ప్రభుత్వ భవనాలు, మౌళిక సదుపాయాలకు మంజూరు చేసిన రూ. 1050 కోట్లకు లెక్కలడుగుతోంది. దాంతో రాష్ట్రం తలపట్టుకుంటోంది. కేంద్ర ఒకందుకు నిధులిస్తే, రాష్ట్రప్రభుత్వం మరొకందకు వ్యయం చేసేసింది. దాంతో లెక్కలు తేల్చటానికి నానా అవస్తలు పడుతోంది.
ఈ ఆర్ధిక సంవత్సరంలో రాజధాని పేరుతో కేంద్రం రూ. 450 కోట్లు మంజూరు చేసింది. అయితే, రాష్ట్రప్రభుత్వానికి మాత్రం అందించలేదు. కారణమేమిటంటే గతంలో విడుదల చేసిన మొత్తానికి రాష్ట్రం లెక్కలు చెప్పకపోవటమే. గతంలో కేంద్రం ఇచ్చిన నిధులను రాష్ట్రం కన్సల్టెంట్ల ఫీజుల క్రింద, కౌలు రైతుల పరిహారం చెల్లింపు కోసం ఖర్చు చేసింది. అయితే, వాటిని మౌళిక సదుపాయాల కల్పన, భవనాల నిర్మాణానికి మాత్రమే వ్యయం చేయాలి. కేంద్రం లెక్కలడిగినపుడు రాష్ట్రం అదే విషయాన్ని చెప్పింది.
ఇక్కడే నీతి అయోగ్ అడ్డం తిరిగింది. కేంద్రం మంజూరు చేసిన నిధులను తన ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేసినందున తాజాగా మంజూరు చేయాల్సిన రూ. 450 కోట్లను విడుదల చేయలేమని స్పష్టం చేసింది. దాంతో రాష్ట్ర ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు ఢిల్లీ వెళ్లి రూ. 450 కోట్ల విడుదలకు బ్రతిమలాడుకుంటున్నారు. అదేసమయలో గతంలో విడుదలైన నిధులకు కేంద్రం చెప్పినట్లు ఖర్చు చేసినట్లు లెక్కలు సర్దబాటు చేసే పనిలో బిజిగా ఉన్నారు. లెక్కలను త్వరగా తయారుచేసి కేంద్రానికి అందచేసే పనిలో ప్రస్తుతం సిఆర్డిఏ బిజీగా ఉంది.
