షాకింగ్: తెలుగు మాట్లాడే వారు తగ్గిపోతున్నారు

Census Reveals Telugu Language Slips To No 4 Slot
Highlights

గత 2011 జనాభా లెక్కల ప్రకారం చూస్తే.. దేశంలో అత్యధికులు మాట్లాడే మాతృభాషలలో తెలుగు భాష మూడవ స్థానం నుంచి నాల్గవ స్థానానికి పడిపోయింది. 

దేశ భాషలందు తెలుగు భాష లెస్స అని మనం చిన్నప్పుడు చదువుకున్నాం. కానీ ఇప్పుడు ఈ తరం పిల్లలు మాత్రం దేష భాషలందలు తెలుగు భాష 'లెస్సా' (తక్కువ) అంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు మాట్లాడుతున్న వారి సంఖ్య తగ్గుతున్నట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దాదాపు 50 ఏళ్ల క్రిందట దేశంలో రెండో స్థానంలో ఉన్న తెలుగు భాష ఇప్పుడు నాల్గవ స్థానానికి పడిపోయిందని కేంద్ర ప్రభుత్వ వెల్లడించిన గణాంకాలు చెబుతున్నాయి.

దేశ జనాభాలో మాతృ భాషల్లో మాట్లాడే వారు ఎంతమంది ఉన్నారో వివరిస్తూ రూపొందించిన ఓ నివేదికను కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసింది. గత 2011 జనాభా లెక్కల ప్రకారం చూస్తే.. దేశంలో అత్యధికులు మాట్లాడే మాతృభాషలలో తెలుగు భాష మూడవ స్థానం నుంచి నాల్గవ స్థానానికి పడిపోయింది. దేశంలో 2011 నాటికి మొత్తం తెలుగు మాట్లాడే వారి సంఖ్య 8.1 కోట్లుగా ఉండగా, ఇదే సమయంలో మరాఠీ మాట్లాడే వారి సంఖ్య 8.3 కోట్లుగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

అదే, 1961 జనాభా లెక్కల ప్రకారం చూసినట్లయితే, దేశంలో అత్యధిక మంది ప్రజలు మాట్లాడే భాషగా తెలుగు రెండవ స్థానంలో ఉండేది. కాగా.. 2011కి ముంది నాల్గవ స్థానంలో ఉన్న మరాఠీ భాష 2011 తర్వాత జనాభ లెక్కల ప్రకారం చూసుకున్నట్లయితే మూడవ స్థానానికి పెరిగింది. దీన్ని బట్టి చూస్తుంటే, దేశంలో తెలుగు భాష మాట్లాడుతున్న వారి సంఖ్య తగ్గిపోతున్నట్లు తెలుస్తోంది. కాగా.. దేశ జనాభాలో అత్యధికంగా 43.63 శాతం హిందీని తమ మాతృభాషగా ఎంచుకున్నట్లు ఈ గణాంకాలు చెబుతున్నాయి.
 

loader