Asianet News TeluguAsianet News Telugu

డ్రగ్ కేసు విచారణలో డ్రెస్ కోడ్

  • పబ్ లో డ్రెస్ కోడ్ పాటించారు
  • డ్రగ్ కేసు విచారణకూ డ్రెస్ కోడ్ లో వచ్చారు
  • వైట్ డ్రెస్ లో మగవాళ్లు, బ్లాక్ డ్రెస్ లో ఆడవాళ్లు
  • హాట్ టాపిక్ అయిన డ్రగ్ డ్రెస్ కోడ్
celebrities followed dress code on  drug case  investigation

 

పబ్ కు వెళ్లేవారు డ్రెస్ కోడ్ పాటించాలని అంటుంటారు. అందరూ డ్రెస్ కోడ్ మస్టుగా ఫాలో అవుతారు. అదే అలవాటును మన సినిమా తారలు డ్రగ్ కేసు విచారణలోనూ డ్రెస్ కోడ్ తో వచ్చి హల్ చల్ చేస్తున్నారు. తాజాగా సిట్ కార్యాలయానికి ముమైత్ ఖాన్ బ్లాక్ ఆండ్ బ్లాక్ డ్రెస్ లో హాజరయింది. నల్లని దుస్తులు, నల్ల కళ్లద్దాలతో నల్ల కలువలా సిట్ ఆఫీసు వద్ద దర్శనమిచ్చింది ముమైత్. 
ముమైత్ డ్రెస్ కోడ్ చూసినవారికి ఒక అనుమానం రాక మానదు. అదేమిటంటే ఇప్పటి వరకు సిట్ కార్యాలయానికి వస్తున్న సెలబ్రిటీలంతా డ్రెస్ కోడ్ ను ఫాలో అవుతున్నారేంటబ్బా అని.  నిన్న చార్మీ కూడా బ్లాక్ ఆండ్ బ్లాక్ లో హాజరు అయింది.  నేడు ముమైత్ అదే ఫాలో అయింది. 
ఇక ఇంతకు ముందు హాజరైన మగ సినీ ప్రముఖులంతా ఒకే విధమైన దుస్తులతో హాజరు కావడం చర్చనీయాంశమైంది. సిట్ ఎదుట హాజరైన పురుష సెలబ్రిటీలు అందరూ వైట్ ఆండ్ వైట్ డ్రెస్ కోడ్ ఫాలో అయ్యారు. పూరీలో మొదలైన ఈ వైట్ డ్రెస్ కోడ్ సెంటిమెంట్ ఆర్ట్ డైరెక్టర్  చిన్నా వరకు కొనసాగింది. పూరి తర్వాత సుబ్బరాజు, తర్వాత తరుణ్, తర్వాత నవదీప్ ఆ తర్వాత చిన్నా అందరూ వరుసపెట్టి వైట్ డ్రెస్ కోడ్ మెంటెయిన్ చేశారు. ఆడ స్టార్స్ చార్మీ, ముమైత్ లు మాత్రం బ్లాక్ డ్రెస్ ను వేసుకొచ్చారు. ఇలా సిట్ ముందు హాజరవుతున్న పురుషులంతా వైట్ ను, మహిళలు బ్లాక్ ను తమ సెంటిమెంట్ గా మార్చుకున్నారేందబ్బా అని జనాలు ఆశ్చర్యపోతున్నారు.  అనుకోకుండా జరుగుతుందో, లేదా అనుకుని వస్తున్నారో గాని సెలబ్రిటీలంతా దుస్తుల విషయంలో సెంటిమెంట్ నమ్ముతున్నారన్న అనుమానాలు మాత్రం బలపడుతున్నాయి.  
అయితే దుస్తుల విషయంలో వీరు చూపిస్తున్న సారుప్యం మాత్రం జనాల్లో ఒకింత ఆసక్తిని రేపుతోంది. వారిపై ఉన్న అభియోగాలపై కాకుండా వారు వేసుకొస్తున్న దుస్తులపైనే ఇప్పుడు ప్రజల్లో చర్చ జరుగుతోంది. ఈ డ్రెస్ కోడ్ సెంటిమెంటైనా వారిని కేసులనుంచి తప్పిస్తుందేమో చూడాలి.

Follow Us:
Download App:
  • android
  • ios