Asianet News TeluguAsianet News Telugu

ఏపీ కేబినెట్ కు సిఈసీ కండీషన్స్ ఇవే.....

ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో మంత్రి వర్గ ఎజెండాకు మాత్రమే కేంద్ర ఎన్నికల సంఘం ఆమోద ముద్ర వేసింది. మంచినీరు, సాగునీరు, ఫొని తుఫాను, కరువు అంశాలపై కేబినెట్‌ భేటీలో చర్చించనున్నారు. అయితే కొత్త నిర్ణయాలకు, రేట్ల మార్పుకు, బకాయిల చెల్లింపులకు ఎలాంటి అనుమతులు లేవని స్పష్టం చేసింది.

cec conditions may applied for ap cabinet
Author
Amaravathi, First Published May 13, 2019, 8:05 PM IST

అమరావతి: గత కొద్ది రోజులుగా ఉత్కంఠ రేపుతున్న ఏపీలో కేబినెట్ భేటీపై కేంద్ర ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చేసింది. కేబినెట్ కు అనుమతినిస్తూనే కండీషన్స్ అప్లై చేసింది.  మంగళవారం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో నిర్వహించబోయే మంత్రి వర్గ సమావేశానికి కేంద్ర ఎన్నికల సంఘం షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. 

ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో మంత్రి వర్గ ఎజెండాకు మాత్రమే కేంద్ర ఎన్నికల సంఘం ఆమోద ముద్ర వేసింది. మంచినీరు, సాగునీరు, ఫొని తుఫాను, కరువు అంశాలపై కేబినెట్‌ భేటీలో చర్చించనున్నారు. 

అయితే కొత్త నిర్ణయాలకు, రేట్ల మార్పుకు, బకాయిల చెల్లింపులకు ఎలాంటి అనుమతులు లేవని స్పష్టం చేసింది. బకాయిల చెల్లింపులకు ఎలాంటి అనుమతులు లేవని అవసరమైతే ఎన్నికల సంఘం అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని ఈసీ అనుమతి తర్వాత అమలు చేయాలని పేర్కొంది. అంతేకాకుండా కేబినెట్‌ భేటీ అనంతరం నిర్ణయాలపై ఎలాంటి మీడియా సమావేశం నిర్వహించరాదని ఆంక్షలు విధించింది. 

cec conditions may applied for ap cabinet

ఈ వార్తలు కూడా చదవండి

చంద్రబాబుకు తీపికబురు: కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్

Follow Us:
Download App:
  • android
  • ios