ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకోసం జగన్ సర్కార్ మరో కీలక నిర్షయం తీసుకుంది. 2021-22 విద్యా సంవత్సరానికి గానూ గవర్నమెంట్ స్కూల్స్ లో ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు సీబీఎస్ఈ  విధానాన్ని అమలు చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. 

ఈ సీబీఎస్ఈ  విధానాన్ని 2024 నాటికి పదో తరగతి వరకు వర్తింపజేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. అలాగే జగనన్న విద్యా కానుక కిట్ లో ఇంగ్లీష్-తెలుగు డిక్షనరీ తప్పనిసరిగా ఉండాలని ఆదేశించారు. 

ఇక ప్రభుత్వ పాఠశాల్లో విద్యార్ధులకు ఇచ్చే పుస్తకాలు నాణ్యతలో ప్రైవేట్ స్కూళ్లకు పోటీగా ఉండాలని పేర్కొన్నారు. అమ్మ ఒడి పధకం ఆప్షన్‌లో భాగంగా విద్యార్ధులకు ఇచ్చే ల్యాప్ టాప్ లు క్వాలిటీతో ఉండాలన్నారు. అలాగే చిన్నారులకు ఎలా బోదించాలన్న దానిపై అంగన్‌వాడీ టీచర్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని తెలిపారు. 

కాగా, రాష్ట్ర వ్యాప్తంగా పక్కా భవనాలు లేని 390 పాఠశాలలకు వెంటనే భవనాలు నిర్మించాలని ఆదేశించారు. పాఠశాలల్లో పరిశుభ్రత ముఖ్యమన్న సీఎం.. అందుకోసం 27వేల మంది ఆయాలను నియమించాలన్నారు. విద్యార్థులకు సౌకర్యవంతంగా ఉండేలా క్లాస్‌రూమ్‌లను సిద్దం చేయాలని సీఎం జగన్ అధికారులకు తెలిపారు.