జగన్‌ పాత్రపై తమ వద్ద ఆధారాలు ఉన్నాయని సీబీఐ కోర్టుకు తెలిపింది. జగన్‌ దాఖలుచేసిన డిశ్చార్జి పిటిషన్‌పై శుక్రవారం సీబీఐ కోర్టులో విచారణ జరగనుంది.
పెట్టుబడిదారులను జగన్మోహన్ రెడ్డి మోసం చేసారంటూ సిబిఐ పిటీషన్ దాఖలు చేసింది. అక్రమాస్తుల కేసులో తన పేరు తొలగించాలని వైసిపి అధినేత వైఎస్ జగన్ సీబీఐ కోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే కదా? దాంతో జగతి పెట్టుబడుల కేసులో గురువారం సీబీఐ కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. పెట్టుబడిదారులను జగన్ మోసం చేశారని పిటిషన్లో పేర్కొంది. రాంకీ, వాన్పిక్, జగతి పెట్టుబడుల కేసుల్లో జగన్ డిశ్చార్జి పిటిషన్ దాఖలు చేశారు.
జగన్ పాత్రపై తమ వద్ద ఆధారాలు ఉన్నాయని సీబీఐ కోర్టుకు తెలిపింది. జగన్ దాఖలుచేసిన డిశ్చార్జి పిటిషన్పై శుక్రవారం సీబీఐ కోర్టులో విచారణ జరగనుంది. ఇదే కేసులో తన పేరును తొలగించాలని పేర్కొంటూ వైసీపీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఇటీవల డిశ్చార్జి పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆయన పిటిషన్ పైన కుడా సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. రేపటి విచారణలో ఏం జరుగుతుందో చూడాలి.
