వంగవీటి రాధ హత్యకు రెక్కీ జరగడంపై సిబిఐతో విచారణ జరిపించాలని తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని నాని డిమాండ్ చేసారు. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకువెళతానని నాని తెలిపారు. 

అమరావతి: తన హత్యకు కుట్రలు జరుగుతున్నాయంటూ తండ్రి వంగవీటి మోహనరంగా వర్థంతి (vangaveeti mohanranga vardanthi) కార్యక్రమంలో టిడిపి నేత వంగవీటి రాధాకృష్ణ (vangaveeti radha) వ్యాఖ్యలు ఒక్కసారిగా ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. మీకంటే మీకే రాధాను చంపే అవసరం వుందంటూ అధికార, ప్రతిపక్ష టిడిపి నాయకులు ఆరోపణలో ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు (nara chandrababu naidu) రాధాను పరామర్శించారు. 

రాధా ఇంటికి వెళ్ళిన చంద్రబాబు దంపతులతో ముచ్చటించారు. కుట్రలో భాగంగా జరిగిన రెక్కీకి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. వంగవీటి కుటుంబానికి టిడిపి ఎల్లవేళలా అండగా వుంటుందని చంద్రబాబు భరోసా ఇచ్చారు.

Video

ఇదిలావుంటే ఇవాళ(సోమవారం) విజయవాడ ఎంపీ కేశినేని నాని (kesineni nani), మాజీ మంత్రి నెట్టెం రఘురాం,మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య,మరికొందరు టీడీపీ నేతలు వంగవీటి రాధ నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు.

read more రెక్కీ ఎవరు చేశారో బయట పెట్టాలి: వంగవీటి రాధాకు మంత్రి వెల్లంపల్లి డిమాండ్

మొదట వంగవీటి రాధ యోగక్షేమాలు తెలుసుకున్న టిడిపి నాయకులు చెప్పారు. హత్యకు రెక్కీ నిర్వహించారని స్వయంగా రాధే ఆందోళన వ్యక్తం చేసారు కాబట్టి ఆ వివరాలను అడిగి తెలుసుకున్నారు. అన్నివేళలా జాగ్రత్తగా ఉండాలని టిడిపి నాయకులు రాధాకు సూచించారు.

ఈ సందర్భంగా ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ... వంగవీటి కుటుంబం రాష్ట్ర సంపద అన్నారు. పేద ప్రజలకు వంగవీటి కుటుంబం ఎప్పుడు అండగా ఉంటుందన్నారు. హత్యా రాజకీయాలకు ఎప్పుడు ఆనాడు ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు ఎప్పుడు ప్రోత్సహించలేదన్నారు. 

''వంగవీటి రాధా మంచి వ్యక్తి. తాను నష్టపోతాడు కానీ ఎవరినీ రాధా ఇబ్బంది పెట్టడు. పదవులు ఆశించే వ్యక్తి రాధా కాదన్నారు. అలాంటి వ్యక్తి హత్యకు రెక్కీ జరగడం దారుణం. పాత బెజవాడ రోజులు తీసుకురావద్దు అని పోలీసులను కోరుతున్నాను. ఏపీలో శాంతి భద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉంది'' అని ఎంపీ ఆందోళన వ్యక్తం చేసారు. 

read more హత్యకు రెక్కీ.. వంగవీటి రాధా ఇంటికి చంద్రబాబు, అండగా వుంటామని హామీ

''విజయవాడ నగరాన్ని డిజిపి, పోలీస్ కమీషనర్ ప్రశాంతంగా ఉంచాలి. రాధా రెక్కీ అంశంపై వెంటనే సీబీఐ విచారణ జరపాలి. ఈ విషయంపై ఒక ఎంపీగా నేను కూడా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తాను. కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి రాధాపై రెక్కీ అంశాన్ని తీసుకువెళ్తా'' అని ఎంపీ నాని స్పష్టం చేసారు.

''వంగవీటి కుటుంబం రాజకీయాలు ఉన్నంతవరకు తెరమరుగు అవ్వదు. రంగా కుటుంబం పుట్టినప్పుడు మంత్రి వెల్లంపల్లి ఇంకా పుట్టి ఉండడు'' అంటూ రాధాను రాజకీయాల్లో మర్చిపోయారన్న మంత్రి వ్యాఖ్యలకు ఎంపీ నాని కౌంటరిచ్చారు.

ఇదిలావుంటే వంగవీటి రాధాకృష్ణ హత్యకు రెక్కీ వ్యవహారంపై జరిగిన విచారణపై విజయవాడ పోలీస్ కమీషనర్ క్రాంతి రాణా కీలక వ్యాఖ్యలు చేసారు. అసలు రాధాపై రెక్కీ జరిగినట్లు ఎలాంటి ఆధారాలు దొరకలేదని స్పష్టం చేశారు. అయితే విచారణ మరింతో లోతుగా సాగిస్తున్నామని సిపి తెలిపారు. ఇప్పటికే రాధాకు గన్‌మెన్లను కేటాయించామని సీపీ వెల్లడించారు. రెక్కీకి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించామని... అందులోనూ ఎలాంటి ఆధారాలు లభించలేదని క్రాంతి రాణా పేర్కొన్నారు.