రెక్కీ ఎవరు చేశారో బయట పెట్టాలి: వంగవీటి రాధాకు మంత్రి వెల్లంపల్లి డిమాండ్
తన హత్యకు ఎవరు రెక్కీ నిర్వహించారో వంగవీటి రాధా బయట పెట్టాలని ఏపీ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కోరారు. ఆదివారం నాడు ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు.
అమరావతి: తన హత్యకు రెక్కీ ఎవరు నిర్వహించారో వంగవీటి రాధా బయట పెట్టాలని ఏపీ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కోరారు. గత ఏడాది డిసెంబర్ 26న గుడివాడలో జరిగిన వంగవీటి రంగా 33వ వర్ధంతి సభలో తన హత్యకు రెక్కీ నిర్వహించారని వంగవీటి రాధా సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
ఆదివారం నాడు విజయవాడలో ఏపీ రాష్ట్ర మంత్రి vellampalli srinivas మీడియాతో మాట్లాడారు. రాజకీయ లబ్ది కోసం చంద్రబాబు చెప్పినట్టు చేయవద్దని వంగవీటి రాధాకు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ హితవు పలికారు. ఇప్పటికే రాధాను రాజకీయాల్లో మర్చిపోయారన్నారు. తన హత్యకు సంబంధించి రెక్కీ నిర్వహించారని ప్రకటించిన వంగవీటి రాధా.... ఈ విషయమై ఎందుకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదో చెప్పాలన్నారు. వంగవీటి రాధా ఇల్లు మెయిన్ రోడ్డులోనే ఉందన్నారు. అక్కడ కారు తిరిగితే రెక్కీ అవుతుందా అని ఆయన ప్రశ్నించారు. టీడీపీ హయంలోvangaveeti Ranga ఎందుకు దీక్ష చేశారో రాధా తెలుసుకోవాలని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కోరారు.
హత్యా .. రెక్కీ అంటూ వంగవీటి రాధా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం భద్రత కోసం గన్‌మెన్లను కేటాయించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. వంగవీటి రాధా భద్రత కోసంGunmensను కేటాయించినా కూడా వెనక్కి పంపి చీప్ రాజకీయాలు చేస్తారా అని మంత్రి Vangaveeti Radha పై మండిపడ్డారు.రాధా రెక్కీ అంశంపై సీఎం Ys Jagan వెంటనే స్పందించారన్నారు.Tdp హాయంలో రంగా హత్య జరిగితే అదే పార్టీతో రాధా అంటకాగుతున్నారని మంత్రి విమర్శించారు.
also read:హత్యకు రెక్కీ.. వంగవీటి రాధా ఇంటికి చంద్రబాబు, అండగా వుంటామని హామీ
గుడివాడ వేదికగా వంగవీటి రాధా చేసిన సంచలన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో కలకం రేపుతున్నాయి. వంగవీటి రాధాకు ఏపీ ప్రభుత్వం 2+2 గన్‌మెన్లను కేటాయించింది. అయితే గన్ మెన్లను వంగవీటి రాధా వెనక్కి పంపారు. వంగవీటి రాధా చేసిన సంచలన వ్యాఖ్యల నేపథ్యంలో ఏపీ డీజీపీకి చంద్రబాబు లేఖ రాశారు. ఈ విషయమై వంగవీటి రాధాతో కూడా ఆయన ఫోన్ లో మాట్లాడారు. జనవరి 1వ తేదీన చంద్రబాబునాయుడు వంగవీటి రాధా నివాసానికి వెళ్లారు.ఈ ఘటన గురించి రాధాతో మాట్లాడారు. రాధాకు టీడీపీ పూర్తి మద్దతును ప్రకటిస్తుందని చెప్పారు.
2019 ఎన్నికల ముందు వైసీపీని వీడి వంగవీటి రాధా టీడీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా వంగవీటి రాధా ప్రచారం నిర్వహించారు. అయితే ఆ ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలై వైసీపీ అధికారంలోకి వచ్చింది. వంగవీటి రంగా 33వ వర్థంతి సభలో సంచలన వ్యాఖ్యలు చేసిన రాధా మరోసారి వార్తల్లో ప్రముఖంగా నిలిచారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతుంది.వంగవీటి రాధా హత్య చేసేందుకు రెక్కీకి సంబంధించి స్పష్టమైన ఆధారాలు లభ్యం కాలేదని రెండు రోజుల క్రితం విజయవాడ సీపీ క్రాంతి రాణా టాటా స్పష్టం చేశారు. ఈ విషయమై తమకు ఎవరూ కూడా ఫిర్యాదు చేయలేదని కూడా సీపీ తెలిపారు.