జగన్ ను ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది:మాజీ జేడీ లక్ష్మీ నారాయణ సమాధానం

cbi ex jd lakshminarayana talk ys jagan cas
Highlights

మాజీ జేడీ లక్ష్మీ నారాయణ సమాధానం 

తెలుగు రాష్ట్రంలో ప్రస్తుత వైకాపా అధినేత, అప్పటి కాంగ్రెస్ ఎంపీ వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసును విచారించిన నాటి సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ, తాజాగా, ఓ టీవీ చానల్ కు ఇంటర్వ్యూ ఇస్తున్న వేళ జగన్ కేసుల ప్రస్తావన రాగా కీలక వ్యాఖ్యలు చేశారు. 

తాము నిబంధనల ప్రకారం వ్యవహరించి, పై అధికారుల నుంచి అనుమతి తీసుకున్న తరువాతనే ఆనాడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అరెస్ట్ చేశామని, సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ వ్యాఖ్యానించారు.

2011లో కేసు తన ముందుకు వచ్చిందని తెలిపారు. ఈ కేసు కోసం తానేమీ నియమించబడలేదని, జగన్ ను అరెస్ట్ చేయాలని తనపై ఎటువంటి రాజకీయ ఒత్తిడులూ రాలేదని చెప్పారు. అందుబాటులో ఉన్న సాక్ష్యాల ఆధారంగానే విచారణ జరిపామని, ఎక్కడా నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించలేదని, సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ వ్యాఖ్యానించారు.

 

 

loader