వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ కోర్ట్ శుక్రవారం సమన్లు జారీ చేసింది. ఆగస్ట్ 14న కోర్టు ఎదుట విచారణకు హాజరుకావాల్సిందిగా ఆదేశించింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. జగన్ సోదరుడు, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ కోర్ట్ శుక్రవారం సమన్లు జారీ చేసింది. ఆగస్ట్ 14న కోర్టు ఎదుట విచారణకు హాజరుకావాల్సిందిగా ఆదేశించింది. వివేకా హత్య కేసులో సీబీఐ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను కోర్ట్ పరిగణనలోనికి తీసుకుంది. అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిపై సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. అంతేకాదు.. వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిని సీబీఐ 8వ నిందితుడిగా పేర్కొంది.
