యూకే వెళ్లడానికి అనుమతి కోరుతూ ఏపీ సీఎం , వైసీపీ అధినేత వైఎస్ జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై నిర్ణయాన్ని సీబీఐ కోర్ట్ వాయిదా వేసింది. అటు సింగపూర్ , దుబాయ్, జర్మనీ, యూఎస్, యూకే వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని విజయసాయిరెడ్డి కోరారు.
యూకే వెళ్లడానికి అనుమతి కోరుతూ ఏపీ సీఎం , వైసీపీ అధినేత వైఎస్ జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై నిర్ణయాన్ని సీబీఐ కోర్ట్ వాయిదా వేసింది. జగన్‌తో పాటు వైసీపీ రాజ్యసభ సభ్యుడు కూడా విదేశాలకు వెళ్లేందుకు న్యాయస్థానం అనుమతి కోరారు. సెప్టెంబర్ 2న లండన్‌లో చదువుకుంటున్న తన కుమార్తెను కలిసేందుకు వెళ్లాలని జగన్ భావించారు. బెయిల్ నిబంధనల దృష్ట్యా కోర్టు అనుమతి కోరారు. అయితే విచారణ సందర్భంగా పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేసేందుకు సీబీఐ .. కోర్టును గడువు కోరింది. దీంతో న్యాయస్థానం విచారణను ఇవాళ్టీకి వాయిదా వేసింది.
బుధవారం ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని కోర్టును కోరింది. అయితే తుది నిర్ణయం రేపు వెలువరిస్తామని కోర్ట్ స్పష్టం చేసింది. అటు సింగపూర్ , దుబాయ్, జర్మనీ, యూఎస్, యూకే వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని విజయసాయిరెడ్డి కోరారు. ఆయన విషయంలోనూ రేపు కోర్టు నిర్ణయం వెలువరించనుంది.
