గుంటూరు నగరానికి చెందిన మాజీ ఎమ్మెల్యే తాడిశెట్టి వెంకట్రావుపై సిబిఐ కేసు నమోదు చేసింది. స్టేట్ బ్యాంక్‌ వద్ద రుణం తీసుకోని కట్టకుండా ఎగ్గొట్టాడనే ఆరోపణలతోనే కేసు నమోదు చేసింది. పొగాకు వ్యాపారం కోసం తాడిశెట్టి వెంకట్రావు ఎస్‌బిఐ నుండి 72 కోట్ల రూపాయల రుణం తీసుకొని తిరిగి చెల్లించలేదు.

తీసుకున్న రుణాలను వ్యక్తిగత ఖాతాలకు మళ్లించుకున్నట్లుగా సిబిఐ గుర్తించింది. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా కాంగ్రెస్‌ పార్టీ తరపున తాడిశెట్టి వెంకట్రావు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయనపై సీబీఐ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.