తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో సీబీఐ విచారణ ప్రారంభమైంది. జిల్లా ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్‌కు చేరుకున్న సీబీఐ బృందం.. సిట్ బృందంతో భేటీ అయ్యింది.

మరోవైపు సీబీఐ రాకతో కొందరు రాజకీయ నాయకులు.. ఇతర ప్రాంతాలకు వెళ్లినట్లుగా సమాచారం. కాగా గత ఏడాది మార్చిలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు గురైన సంగతి తెలిసిందే.

Also Read:వివేకా హత్య వెనుక వైఎస్ భారతి బంధువులు... ఆ ముగ్గురిపనే: చంద్రబాబు సంచలనం

ఈ సందర్భంగా ఈ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని నాటి ప్రతిపక్షనేత, నేటి ముఖ్యమంత్రి జగన్ డిమాండ్ చేశారు. అంతేకాకుండా హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు. అయితే సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు.

అయితే సునీత పిటిషన్‌ను విచారించిన ఉన్నత న్యాయస్థానం.. హత్య కేసుగా నమోదు చేసీ, సీబీఐ విచారణ జరిపించాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో సీబీఐ రంగంలోకి దిగింది. సిట్ బృందం నుంచి వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది.

Also Read:సీబీఐకి వైఎస్ వివేకా హత్య కేసు ఎందుకంటే...: జడ్జి చెప్పిన కారణం ఇదీ...

ఈ కేసులో సిట్ ఇప్పటి వరకు 1400 మందిని విచారించినా.. ఏదీ తేల్చుకోలేకపోయింది. సిట్ దర్యాప్తుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దీంతో సాధ్యమైనంత వేగంగా కేసు దర్యాప్తు చేసి, నివేదిక అందించాలని సీబీఐని ఆదేశించింది.