ఆళ్లగడ్డ: మాజీ మంత్రి, టీడీపీ నాయకురాలు భూమా అఖిలప్రియపై కేసు నమోదైంది. ఈ విషయాన్ని కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ సీఐ సుబ్రహ్మణ్యం చెప్పారు. ఆళ్లగడ్డ పట్టణంలో కోవిడ్ నిబంధనల మేరకు సెక్షన్ -30 అమలులో ఉన్నప్పటికి అఖిలప్రియ బుధవారం జాతీయ రహదారి దిగ్బంధం చేపట్టినట్లు తెలిపారు. 

వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించడంతో పాటు ప్రజలకు తీవ్రమైన ఇబ్బందులకు గురిచేసినందుకు అఖిప్రియపై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. ఆమెతో పాటు టీడీపీకి చెందిన మరో 25 మందిపై కూడా కేసు నమోదు చేసినట్లు తెలిపారు.