రాజధాని అమరావతి కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి లాంగ్ మార్చ్  చేయనున్నారు. గతంలో ఇసుక కొరత వల్ల భవన నిర్మాణ కార్మికులు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లేందుకు వారి సమస్యల పరిష్కారం కోసం పవన్ కళ్యాణ్ విశాఖ వేదికగా లాంగ్ మార్చ్ చేపట్టారు. 

మరోసారి అదే తరహాలో అమరావతి రైతుల కోసం విజయవాడలో లాంగ్ మార్చ్ నిర్వహించాలని పవన్ కళ్యాణ్ ప్లాన్ చేసినట్టు సమాచారం. ఈ లాంగ్ మార్చ్ వివరాలను పవన్ స్వయంగా మీడియాలో సమావేశంలో ప్రకటించే అవకాశం ఉంది.

AlsoRead బ్రహ్మణి కి అమ్మఒడి డబ్బులు... సీఎంకి లోకేష్ థ్యాంక్స్.. పోస్ట్ వైరల్...

ఇదిలా ఉండగా... ప్రభుత్వం మాత్రం మూడు రాజధానులు పెట్టాలని నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై కేబినెట్ స్పందించిన తర్వాతే తాను దీని గురించి మాట్లాడతానని పవన్ గతంలోనే పేర్కొన్నారు. కేంద్రం ఇప్పటి వరకు దీనిపై నోరు ఎత్తకపోవడంతో.. పవన్ కూడా నోరు మెదపడం లేదు. ఈ నేపథ్యంలో ఆయన లాంగ్ మార్చ్ చేస్తారనే వార్త సంచలనంగా మారింది.