మూడో విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కర్నూలు జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. డోన్‌కోచెర్వులో గెలుపొందిన వారిపై రాళ్ల దాడికి కొందరు ప్రయత్నించారు. దీనితో పాటు బ్యాలెట్ బాక్సులను ప్రత్యర్ధులు ధ్వంసం చేశారు

మూడో విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కర్నూలు జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. డోన్‌కోచెర్వులో గెలుపొందిన వారిపై రాళ్ల దాడికి కొందరు ప్రయత్నించారు.

దీనితో పాటు బ్యాలెట్ బాక్సులను ప్రత్యర్ధులు ధ్వంసం చేశారు. అడ్డుకున్న పోలీసులపైనా దాడులు చేసేందుకు యత్నించారు. ఆగ్రహంతో ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు.

ఓటర్ల ఇళ్లపై కర్రలతో దాడి చేసేందుకు సిద్ధమయ్యారు.. డబ్బులు తీసుకుని ఓట్లు వేయలేదంటూ పలు ఇళ్లపైనా దాడికి దిగారు. ఈ ఘటనలో పలువురికి తీవ్రగాయాలవ్వడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 1201 పంచాయతీల ఫలితాలు వెలువడ్డాయి. వీటిలో వైసీపీ 983, టీడీపీ 167, జనసేన 10, బీజేపీ 3, ఇతరులు 38 స్థానాలను కైవసం చేసుకున్నారు.

ఇకపోతే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో ఫలితాలు ఆసక్తికరంగా మారాయి. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం మొత్తం 89 పంచాయతీలకు గాను వైసీపీ 31 చోట్ల గెలుపొందగా టీడీపీ 6, కాంగ్రెస్ 1 స్థానాల్లో గెలిచాయి. 2013లో టీడీపీ 72, కాంగ్రెస్ 14, వైసీపీ 8 స్థానాలను కైవసం చేసుకున్నాయి.