జగన్ కు పవన్ మద్దతు ప్రకటిస్తారా ?

జగన్ కు పవన్ మద్దతు ప్రకటిస్తారా ?

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చెప్పిందే నిజమైతే 2019 ఎన్నికల్లో చంద్రబాబునాయుడుకు మద్దతు ఇవ్వకూడదు. అనంతపురంలో తాజగా పవన్ రెండు విషయాలు ప్రస్తావించారు. ‘2019 ఎన్నికల్లో రైతుల కన్నీరు తుడిచే వారికే తన మద్దతు’ అని ప్రకటించారు. అదే సమయంలో ‘తానక్కడికి వచ్చింది ఓట్లు అడగటానికి కాదు..మీకు ఇష్టం ఉంటే జనసేనను గెలిపించండి లేకపోతే లేదు’ అన్నారు.

సరే, రెండో విషయంలో కాస్త క్లారిటీ ఇచ్చారు. ఎందుకంటే, జనాలకు నచ్చితే ఓట్లు వేస్తారు లేకపోతే లేదు. ఆ విషయాన్ని పనవ్ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే మొదటి విషయంపైనే క్లారిటీ లేదు. 2019 ఎన్నికల్లో రైతులు కన్నీరు తుడిచే వారికే తన మద్దతు అంటే అర్ధం ఏమిటో ఎవరికీ అర్ధం కావటం లేదు.

2014 ఎన్నికల్లో అధికారాన్ని అందుకోవటమే లక్ష్యంగా చంద్రబాబు అనేక హామీలిచ్చారు. అందులో రుణమాఫీ కూడా ఒకటి. అయితే, అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్ళయినా ఇంత వరకూ చాలామందికి పూర్తిగా రుణమాఫీ కాలేదు. పంటలకు గిట్టుబాటు ధరలు లేవు. రాజధాని పేరుతో వేలాదిమంది రైతుల నుండి బలవంతంగా భూములు సేకరించారు.

అంటే చంద్రబాబు ఇచ్చిన హామీ నెరవేరలేదనే చెప్పాలి. ఈ విషయాలన్నీ పవన్ కు తెలీనివి కావు. మరి, వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు పవన్ మద్దతు ఇస్తున్నట్లా? ఇవ్వట్లేదా? పైకేమో జనసేన ఒంటరి పోటీ చేస్తుందని చెబుతూన్నా ఆయన చర్యలన్నీ చంద్రబాబుకు మద్దతిచ్చేవిగానే కనబడుతున్నాయి. ఇక, ప్రతిపక్షాలకు జనాల కష్టాలు తీర్చే అవకాశం లేదు. ప్రతిపక్షాలు చేయగలిగిందంతా ప్రజాపక్షాన పోరాటాలు చేయటం, సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తేవటమే. అంటే, ప్రతిపక్షంగా వైసిపి తన బాధ్యతను తాను చేస్తున్నట్లే. మరి, పవన్ మద్దతు వైసిపికి ప్రకటిస్తారా?

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM Andhra Pradesh

Next page