చంద్రబాబు ఎంత చక్రం తిప్పాలనుకున్నా చివరకు జరిగేది ఇదే!! : ఎడిటర్స్ కామెంట్

ప్రస్తుతం కేంద్రంలో చంద్రబాబు నాయుడు మరోసారి కింగ్ మేకర్ లా మారుతున్నాడు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బాగా కలిసొచ్చే అంశం. రాష్ట్ర అబివృద్ధికి కావాల్సిన నిధులు, ప్రత్యేక హోదా ఇతర అనుమతులను సులభంగా సాధించే అవకాశం ఉంటుంది.

Can Chandra babu Spin the Wheel in Center?

దిల్లీలో ఏం జరగొచ్చు!!

మోదీ నేతృత్వంలోని బీజేపీకి ఈ ఎన్నికల్లో కావాల్సిన మెజారిటీ రాలేదు. కేంద్రంలో సొంతంగా పార్టీ ఏర్పాటు చేయాలంటే కనీసం 272 సీట్లు అవసరం కాగా.. ఇప్పుడు బీజేపీకి 240 మాత్రమే ఉన్నాయి దీంతో బీజేపీ ఎన్డీయే మిత్ర పక్షాలపై ఆధారపడక తప్పని సరి పరిస్థితి. మరోవైపు ఇండి కూటమి కూడా ఏ మాత్రం అవకాశం దొరికినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తెరవెనుక పావులు కదుపుతోంది. కేంద్రంలో మోదీ మళ్లీ పీఎం అవుతారా.. లేక రాహులా.. లేక మరెవరా.. అన్ని తేలేదెందుకు కొంచెం సమయం పట్టవచ్చు. ఈ నేపథ్యంలో కేంద్రంలో ఏం జరిగే అవకాశాలున్నాయో చూద్దాం.

ఆప్షన్ 1
మోదీ పీఎం...

Can Chandra babu Spin the Wheel in Center?
ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కేంద్రంలో దాదాపు మోదీనే.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు. ఇది జరగాలి అంటే ముఖ్యంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు.. బిహార్ సీఎం, జేడీయూ నేత నితీశ్ కుమార్ మద్దతు తప్పనిసరి. వీరు ఇంకా చిన్నా చితకా పార్టీలతో కలిసి మోదీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడు.

Can Chandra babu Spin the Wheel in Center?

ఆప్షన్ 2

చంద్రబాబు, నితీశ్ మోదీకి వ్యతిరేకమై ఎన్డీయే నుంచి బయటకు వస్తే.. మోదీని పీఎం కాకుండా చేసే అవకాశాలు ఇండియా కూటమికి మెరుగవుతాయి. కాని అలా జరగదు. ఎందుకంటే ప్రస్తుతం ఎన్డీయే కూటమికి 292 సీట్లు ఉండగా.. చంద్రబాబు నాయుడి పార్టీ టీడీపీకి 16, నితీశ్‌కి 12 సీట్లు మాత్రమే ఉన్నాయి. వీరిలో ఏ ఒక్కరూ బయటకు వచ్చినా.. మరొకరు మద్దతుతో ఎన్డీయే నెగ్గుకు రావచ్చు. ఒకవేళ చంద్రబాబు నాయుడు బయటకు వస్తే.. నితీశ్‌కి ప్రాధాన్యం పెరిగుగుతుంది. అప్పుడు బీజేపీ కూడా నితీశ్ డిమాండ్లకు తలొగ్గయినా సరే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. వైస్ వర్సా.. నితీశ్ బయటకు వెళ్తే.. చంద్రబాబు ఎన్డీయేలో మరింత బలపడుతాడు. దీని వల్ల టీడీపీకి.. ఆంధ్రప్రదేశ్ కి మరింత మేలవుతుంది. దీంతో చంద్రబాబునాయుడు తన డిమాండ్లను సాధించుకోవచ్చు. ఇక నితీశ్ కుమార్ మోదీ ని వదిలి వెళ్లే ప్రసక్తి ఇప్పుడైతే లేదు. ఎందుకంటే 2025 వరకు నితీశ్ సీఎంగా కొనసాగాలంటే.. తనకు రాష్ట్రంలో బీజేపీ మద్ధతు తప్పనిసరి.

Can Chandra babu Spin the Wheel in Center?

ఆప్షన్ 3
ఇక ఇండియా కూటమి అధికారం చేపట్టే అవకాశాలు చాలా కష్టం. ఎందుకంటే మిత్ర పక్షాలను కలుపుకున్నా ఒకవైపు స్టాలిన్, మరోవైపు అఖిలేశ్ యాదవ్, మరోవైపు మమతా బెనర్జీ, తదితర నేతలు ప్రధాని పదవికి పోటీ పడుతారు. ఒకవేళ కాంగ్రెస్ ప్రధాన పదవి తమకు వద్దనుకున్నా వీరు అందరిలోనూ ఐక్యత సాధించడం అంత ఈజీ కాదు. ఐక్యత సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా.. అది 2029 ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధాని అవకాశాలను గట్టి గండి కొడుతుంది. సుస్థిర ప్రభుత్వం లేనపుడు అభివృద్ధి కష్టం కనుక ఇండి కూటమి దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడం మరింత కష్టమవుతుంది. 

కింగ్ మేకర్ చంద్రబాబు
ప్రస్తుతం కేంద్రంలో చంద్రబాబు నాయుడు మరోసారి కింగ్ మేకర్ లా మారుతున్నాడు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బాగా కలిసొచ్చే అంశం. రాష్ట్ర అబివృద్ధికి కావాల్సిన నిధులు, ప్రత్యేక హోదా ఇతర అనుమతులను సులభంగా సాధించే అవకాశం ఉంటుంది.

- వేణుగోపాల్ బొల్లంపల్లి | ఏసియానెట్ న్యూస్ తెలుగు ఎడిటర్ (Ex. BBC, Big Tv, Microsoft News, Eenadu)

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios