Asianet News TeluguAsianet News Telugu

కరోనా వాలంటీర్లకు నోటీఫికేషన్.. అప్లై చేస్తే బంపర్ ఆఫర్

ఈ కరోనా పై యుద్ధం చేయడానికి ఏపీ ప్రభుత్వం కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. కోవిడ్ వారియర్ పేరిట ఓ వినూత్న ప్రయత్నం మొదలుపెట్టింది. దీనిలో భాగంగా నియామకాలు కూడా చేపట్టింది. ఈ మేరకు ఓ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది.

Call for Volunteers in Fight Against Covid-19  in AP
Author
Hyderabad, First Published Apr 9, 2020, 10:00 AM IST

ప్రపంచ దేశాలను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ అంతకంతకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా రోగులను, లాక్ డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న సామాన్య ప్రజలను రక్షించేందుకు దాతలు ఎందరో ముందుకు వస్తున్నారు. వైద్యులు, వైద్య సిబ్బంది సైతం రోగులను రక్షించేందుకు వారి వంతు కృషి చేస్తున్నారు. ఆ క్రమంలో వారు కూడా వైరస్ బారిన పడుతున్నారు.

Also Read అది సంతోషం, వాటినీ గుర్తించండి: వైఎస్ జగన్ కు చంద్రబాబు లేఖ...

అయితే...ఈ కరోనా పై యుద్ధం చేయడానికి ఏపీ ప్రభుత్వం కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. కోవిడ్ వారియర్ పేరిట ఓ వినూత్న ప్రయత్నం మొదలుపెట్టింది. దీనిలో భాగంగా నియామకాలు కూడా చేపట్టింది. ఈ మేరకు ఓ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది.

 పూర్తి వివరాల్లోకి వెళితే... కరోనాను సమర్థంగా అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా వాలంటీర్ల నియామకం చేపట్టబోతున్నట్లు రాష్ట్ర కోవిడ్ ప్రత్యేకాధికారి ఎం. గిరిజాశంకర్ తెలిపారు. 

వివిధ ఆస్పత్రుల్లో అదనంగా అవసరమయ్యే వైద్య నిపుణులు, పారా మెడికల్‌ సిబ్బందిని సమకూర్చేందుకు డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య వైద్య విశ్వవిద్యాలయం సహకారంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ఆమె పేర్కొన్నారు. 

దీనికి సంబంధించి దరఖాస్తులకు ఆహ్వానిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఉన్న 271 మెడికల్ కాలేజీలు, డెంటల్ కాలేజీలు, యునాని, ఆయుర్వేద నర్సింగ్ కాలేజీలు.. ఇతర వైద్య అనుబంధ కోర్సులు చదివే విద్యార్థులు వాలంటీర్లకు అప్లై చేసుకోవచ్చని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

అంతేకాకుండా ఆసక్తి ఉన్న వైద్యులు, ప్రత్యేక వైద్య నిపుణులు, నైపుణ్యం కల్గిన నర్సులు, పారా మెడికల్‌ సిబ్బంది తదితరులు కూడా కోవిడ్‌ వారియర్స్‌గా పని చేసేందుకు ముందుకు రావొచ్చని సూచించారు. వీరి సేవలను ఆస్పత్రుల్లో, క్వారంటైన్‌ సెంటర్లలో వినియోగించుకోబోతున్నట్లు తెలిపారు.

వాలంటీర్ల సేవలను వారు ఎంపిక చేసుకున్న జిల్లాల్లోనే వినియోగించుకుంటామని.. ఆసక్తి కలిగిన వారు health.ap.gov. in/CVPASSAPP/Covid/ Volunteerjobs వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేసుకోవచ్చని అందులో సూచించారు. ఇదిలా ఉంటే వాలంటీర్లుగా పనిచేసిన వారికి ఏపీ ప్రభుత్వం మరో ఆఫర్‌ను ప్రకటించింది. వీరికి భవిష్యత్తులో ప్రభుత్వం చేపట్టే రిక్రూట్‌మెంట్‌లో ప్రాధాన్యమిస్తామని ఆ ప్రకటనలో వెల్లడించారు.

Follow Us:
Download App:
  • android
  • ios