Asianet News TeluguAsianet News Telugu

తమ్ముళ్లంతా అవాక్కయ్యారు

  నాయుడి మార్కుల కోసం నాలుకని అతిగా వాడిన వాళ్లందరికి డ స్ట్ బిన్నే మిగిలింది.  

cabinet expansion exposed chinks in naidus armour

మంత్రివర్గ విస్తరణ తెలుగుదేశం పార్టీని కుదిపేస్తూ ఉంది.  పార్టీకి సుయిసడ్ స్క్వాడ్ లాగా పనిచనేసిన  వాళ్లంతా ఇపుడుపార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి మీద  నిప్పులు చెరుగుతున్నారు. వాళ్లబాధంతా ఒక్కటే... పార్టీకి ఇంత విధేయంగాపనిచేస్తున్న తమను కాదని, టెక్నికల్ గా ఇంకా వైఎస్ ఆర్ సిపి ఎమ్మెల్యేలు గా ఉంటున్న ఫిరాయింపు దారుల మీద తమ నేత ఇంత ప్రేమ ఎందుకు చూపిస్తున్నట్లు? 

 

 ఇది తమని అవమానించినట్లుగా వాళ్లు ఫీలవుతున్నారు.వీళ్లంతా చంద్రబాబు నైజం మీదే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన నిజాయితీని శంకిస్తున్నారు.   ఫిరాయింపు దారులకు మంత్రి పదవులివ్వడాన్ని వారు జీర్ణించుకోలేక పోతున్నారు.  దీనికి కారణం...ఇదే చంద్రబాబునాయుడు తెలంగాణాలో తమ పార్టీ ఎమ్మెల్యేలని కెసిఆర్ కొనుగోలు చేసి మంత్రి పదవి ఇచ్చినపుడు ఏమన్నాడో అందరికి గుర్తుంది. ముఖ్యంగా అపుడు చంద్రబాబు కెసిఆర్ ని ,  ఏ గవర్నర్ కయితే కాళ్లుమొక్కు పో అని తన కొడుకును పురమాయించాడో అదే గవర్నర్ ని అనరాని మాటలన్నాడు.

 

నిజానికి చంద్రబాబు నాయుడు అంటే ఎవరికీ పెద్ద గౌరవం కాదు,  భజన చేస్తే నాలుగు పనులు దొరుకుతాయి, నాలుగురాళ్లు మిగిలించుకోవచ్చనే ఆశే. అసెంబ్లీలో, అసెంబ్లీ మీడియాపాయింట్ దగ్గర, పబ్లిక్ మీటింగ్ లలో చంద్రాబాబు నాయుడు మీద వీరభక్తి కనబర్చిన ఈ ఎమ్మెల్యేలు ఇపుడు ఇలా అలగడం చూస్తే వీళ్లంతా కేవలం జగన్ ను తిట్టి పదవులు కొట్టేద్దామనుకున్నోళ్లే తప్ప, తెలుగుదేశం మీద, నాయుడి మీద ఎదో పెద్ద గౌరవం ఉన్నోళ్లే కాదని అర్థమవుతుంది. అలాగే, నాయుడికి వీళ్లుంటే ఏమాత్రం అభిమానం లేదు. అందుకే నేను చెప్పినట్లుండండి, దండుకోండి, మళ్లా ఏమ్మాటొద్దు అనేది ఆయన ధోరణి.

 

ఇపుడేం జరిగింది... పార్టీ మీద అలిగి పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి   అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, అవసరమైతే తానే సొంతంగా పార్టీ పెడతా ననే దాకా  వివాదాస్పద చింతమనేని ప్రభాకర్‌ వెళ్లారు. మంత్రి పదవి పోతూనే చిత్తూరు జిల్లాకు చెందిన బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఎమ్మెల్యే పదవికి  రాజీనామా చేశారు. మంత్రి పదవికి తానెలా అనర్హుడో తెలీక ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు తలకిందులవుతున్నాడు. చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభ, తంబళ్లపల్లె ఎమ్మెల్యే శంకర్‌యాద వ్‌ లు కూడ బాబు మీద అసభ్యపదజాలం ప్రయోగించి తిడుతున్నారట. వీళ్లంతా నాయుడి మార్కుల కోసం నాలుకని అతిగా వాడిన వాళ్లే


కాంగ్రెస్‌ పార్టీ నుంచి వచ్చిన పితాని సత్యనారాయణకు మంత్రి పదవి ఇవ్వడం ఏమిటో అర్థం కాక పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు ఆగ్రహంతో ఉన్నారు. ప్రభుత్వ విప్‌ అయిన చింతమనేని ప్రభాకర్‌ ఆదివారం దెందులూరు నియోజకవర్గ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, అనుచరులతో సమావేశమయ్యారు. చింతమనేని సీఎం తో భేటీ అయ్యారు. గుంటూరు జిల్లాలో భంగపడిన పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ ఏకంగా కంట తడిపెట్టాడు. అసలు 2014 లోనే ఆయన అలిగి పార్టీ అధ్యక్షుని కలుసుకోవడం మానేశాడు. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి కూడా  అసంతృప్తి చెందాడు. కార్యకర్తల ముందర చంద్రబాబు మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మంత్రి పదవి ఆశించిన గురజాల ఎమ్మెల్యే యరపతినేని కూడా బాబు కూడా ఇలాగే కుతకుత లాడుతున్నాడు.

 

ఏ పర్వాలేదు. వీళ్లెవరూ పార్టీని అంతసులభంగా వదలరు. మంత్రి పదవి ఆశించి, అలిగిన వాళ్లకు పార్టీ కాదు ముఖ్యం మరేదో ఉంది. అదేదో చంద్రబాబుకి తెలుసు. బోలేడు కాంట్రాక్టులున్నాయి, సబ్ కాంట్రాక్టులున్నాయి,భూములున్నాయి వాటితో వీళ్లందరిని నోరు మూయించవచ్చు. 

 

అయితే, తెలుగుదేశం బండారం మాత్రం బాగా బయటపడింది. ఇది హాని చేసే వీలుంది.ఇంకా ఎలెక్షన్లు రెండేళ్లున్నాయి కాబట్టి క్షణికావేశంలో బంగారు బాతును చంపుకునేంత అమాయకులు కాదు వీళ్లు.  కెసిఆర్ ను చూసి చంద్రబాబు, ఆయన కుమారుడు చాలా  బాగా ఇన్ స్పయిర్ అవుతున్నారు. తెలంగాణా వేరు, ఆంధ్రా వేరుఅనేది వారికి అర్థం అయ్యేసరకి బాగా లేట్ అవుతుందేమో.

 

 

 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios