కానీ కోడెల మాత్రం టీడీపీతో కుమ్మక్కై సభలో ప్రతిపక్షం నోరు నొక్కేశారని ఆరోపించారు. సభలో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదని ఆరోపించారు. వైఎస్ఆర కాంగ్రెస్ పార్టీ విషయంలో అన్నింటా అడ్డుపడ్డారని మండిపడ్డారు. వైసీపీ ఎమ్మెల్యే రోజాను ఏకపక్షంగా ఏడాదిపాటు బహిష్కరించారని ఆరోపించారు.
హైదరాబాద్: ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై నిప్పులు చెరిగారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనేత సి.రామచంద్రయ్య. స్పీకర్ ఔనత్యాన్ని కోడెల శివప్రసాదరావు మంటగలిపారని ఆరోపించారు.
హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాయలంలో మీడియాతో మాట్లాడిన సి. రామచంద్రయ్య స్పీకర్ గా కోడెల శివప్రసాదరావు పనిచెయ్యడం చీకటి అధ్యయనం అంటూ విమర్శించారు. ఏ పార్టీ నుంచి గెలిచినా స్పీకర్ గా ఎన్నికైన తర్వాత నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు.
కానీ కోడెల మాత్రం టీడీపీతో కుమ్మక్కై సభలో ప్రతిపక్షం నోరు నొక్కేశారని ఆరోపించారు. సభలో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదని ఆరోపించారు. వైఎస్ఆర కాంగ్రెస్ పార్టీ విషయంలో అన్నింటా అడ్డుపడ్డారని మండిపడ్డారు. వైసీపీ ఎమ్మెల్యే రోజాను ఏకపక్షంగా ఏడాదిపాటు బహిష్కరించారని ఆరోపించారు.
అధికార పార్టీకి ఒకలా, ప్రతిపక్ష పార్టీకి మరోలా స్పీకర్ కోడెల వ్యవహరించారన్నారు. అసెంబ్లీ ప్రజల గొంతుకను వినిపించాల్సిన జగన్ కు అవకాశం ఇవ్వకుండా మానసికంగా హింసించారని ఆరోపించారు. రాజ్యాంగం ప్రతిపక్ష పార్టీకి ఇచ్చిన హక్కులను కోడెల కాలరాశారని విమర్శించారు.
సభలో న్యాయం జరగదు కాబట్టే ప్రతిపక్ష నాయకుడు ప్రజల్లోకి వెళ్లారని చెప్పుకొచ్చారు. ప్రజల సమక్షంలోనే అధికార పార్టీ తీరును నిరసిస్తూ సుదీర్ఘయాత్ర చేశారని తెలిపారు. అసెంబ్లీలో జరిగిన కార్యక్రమాలన్నీ తెలుగుదేశం కార్యక్రమాలేనని విమర్శించారు.
చంద్రబాబుకు, జగన్ కు పోలికా అన్న కోడెల వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు లాంటి ఊసరవెల్లి నాయకుడు జగన్ కాదన్నారు. చంద్రబాబును ఎవరితో పోల్చిన వారికి అవమానమేనన్నారు. ఆశ ఉండొచ్చు దురాశ ఉండకూడదా అంటూ కోడెల వ్యాఖ్యలపై మండిపడ్డారు.
అధికారం మీ నాయన సొత్తా, మీ సెక్టరే రాష్ట్రాన్ని పరిపాలించాలా అంటూ మండిపడ్డారు. అది దురాశకాదా అని నిలదీశారు. అంబటి రాంబాబుతో నాకు పోలికా అంటున్న కోడెల మీ చరిత్ర ఏమైనా ఘనమైనదా అంటూ మండిపడ్డారు.
నీ సొంత నియోజకవర్గమైన నరసరావుపేట నుంచి సత్తెనపల్లి నియోజకవర్గానికి ఎలా వచ్చావో తెలుసుకో అంటూ విమర్శించారు. నువ్వు ఓడిపోతావ్ అని తెలిసి టికెట్ ఇవ్వకపోతే బతిమిలాడి సత్తెనపల్లికి వచ్చావన్నారు. 2014 ఎన్నికల్లో తక్కువ మెజారిటీతోనే గెలిచావన్నారు సి.రామచంద్రయ్య.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Apr 18, 2019, 1:32 PM IST