Asianet News TeluguAsianet News Telugu

AP Employees PRC: 34 శాతం ఫిట్‌మెంట్ సాధ్యం కాదు.. సీఎం తో భేటీ తర్వాత సజ్జల కీలక వ్యాఖ్యలు

AP Employees PRC: సీఎంతో సజ్జల రామకృష్ణారెడ్డి, ఆర్థికమంత్రి బుగ్గన భేటీ ముగిసింది. ఉద్యోగుల‌కు 34 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వ‌డం సాధ్యం కాదని తేల్చి చెప్పారు సజ్జల రామకృష్ణా రెడ్డి. క‌రోనా వ‌ల్ల రాష్ట్రం  ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంద‌ని,  ప్రస్తుతం ఉద్యోగులకు 27శాతం ఐఆర్ ఇస్తున్నామ‌న్నారు. ఉద్యోగుల గ్రాస్ వేతనం తగ్గకుండా ఉండేలా చర్యలు తీసుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు సజ్జ‌ల‌.సీఎస్ కమిటీ సిఫారసులు, 14.29 శాతం ఫిట్ మెంట్ అమలు చేసే క్రమంలో ఐఆర్ తగ్గకుండా చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు.
 

buggana and sajjala meeting with cm jagan concludes
Author
Hyderabad, First Published Dec 16, 2021, 6:42 PM IST

 AP Employees PRC: సీఎంతో సజ్జల రామకృష్ణారెడ్డి, ఆర్థికమంత్రి బుగ్గన భేటీ ముగిసింది. ఉద్యోగ సంఘాలతో నిన్న జరిగిన చర్చల వివరాలను సజ్జల, బుగ్గన ముఖ్యమంత్రికి వివరించారు. ఉద్యోగులకు ఎంతమేర పీఆర్సీ ఇవ్వాలనే అంశంపై ఈ సమావేశంలో చర్చించారు. సీఎంతో భేటీపై సజ్జల మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యోగుల‌కు 34 శాతం ఫిట్‌మెంట్ సాధ్యం కాదని తేల్చి చెప్పారు  ప్రభుత్వం 14.29శాతం ఇస్తుందని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని 14.29 ఫిట్‌మెంట్‌ అమలుచేస్తూ.. ఐఆర్‌కు రక్షణ కల్పించనున్నట్లు స్పష్టం చేశారు. క‌రోనా, ఆర్థిక సంక్షోభం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని.. ప్రస్తుతం ఉద్యోగులకు 27శాతం ఐఆర్ ఇస్తున్నామ‌న్నారు. 

Read Also: ఏపీ: 24 గంటల్లో 148 మందికి కరోనా.. చిత్తూరులో అత్యధికం

ఉద్యోగుల గ్రాస్ వేతనం తగ్గకుండా ఉండేలా చర్యలు తీసుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు. ఉద్యోగుల మిగిలిన డిమాండ్ల పరిష్కారంపైనా సీఎం జగన్ తో చర్చించినట్లు వివరించారు. సీఎస్‌ కమిటీ సిఫార్సు చేసిన 14.29 ఫిట్‌మెంట్‌ అమలుచేస్తూ.. ఐఆర్‌కు రక్షణ కల్పించనున్నట్లు స్పష్టం చేశారు.  రేపు సీఎంతో ఉద్యోగ సంఘాల చర్చలు ఉండవచ్చు లేదా సోమవారం చర్చలు.. ఉద్యోగ సంఘాల నేతలు సీఎంను కలిసిన తర్వాతే పీఆర్సీపై ప్రకటన ఉంటుంద‌ని సజ్జల ప్ర‌క‌ట‌న చేశారు. ఉద్యోగులు ఎవ‌రు కూడా ఆందోళన చెంద‌నవ‌స‌రం లేద‌ని స‌జ్జ‌ల చెప్పారు.

Read Also: కేసీఆర్‌కు షాకివ్వనున్న డీఎస్ .. త్వరలో కాంగ్రెస్‌ గూటికి, మంతనాలు జరుపుతోన్న హైకమాండ్

గ‌త కొన్ని నెల‌లుగా.. ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు , ప్ర‌భుత్వానికి  పీఆర్సీ , ఫిట్ మెంట్ల‌పై ర‌చ్చ న‌డుస్తోంది . ఈ క్ర‌మంలో ఏపీ జేఏసీ, ఏపీ జేఎసీ అమరావతి నేతలు  55 శాతం పీఆర్సీ ఫిట్ మెంట్ల కావాలని డిమాండ్ చేస్తున్నాయి. మరో వైపు..  ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం 34 శాతం పీఆర్సీ ఫిట్ మెంట్స్ కావాల‌ని,  ప్రభుత్వ ఉద్యోగుల సంఘం 40 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios