జీవిఎల్ కారు ప్రమాదంపై బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు

https://static.asianetnews.com/images/authors/2e35a18e-a821-5ed4-a5f6-aacc683fc7cc.jpg
First Published 25, Aug 2018, 1:02 PM IST
Budha Venkanna comments on GVL car accident
Highlights

బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావుపై తెలుగుదేశం పార్టీ శాసనమండలి సభ్యుడు బుద్దా వెంకన్న తీవ్రంగా మండిపడ్డారు. ప్రతిదానికీ విచారణ జరిపించాలని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ కోరుతుంటారని, నిన్నటి కారు ప్రమాద ఘటనపై కూడా విచారణ కోరాలని ఆయన అన్నారు.

విజయవాడ: బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావుపై తెలుగుదేశం పార్టీ శాసనమండలి సభ్యుడు బుద్దా వెంకన్న తీవ్రంగా మండిపడ్డారు. ప్రతిదానికీ విచారణ జరిపించాలని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ కోరుతుంటారని, నిన్నటి కారు ప్రమాద ఘటనపై కూడా విచారణ కోరాలని ఆయన అన్నారు. 

ప్రమాదం జరిగిన వెంటనే ఘటనాస్థలి నుంచి జీవీఎల్‌ వెళ్లిపోయారని ఆయన శనివారం మీడియా సమావేశంలో అన్నారు. ఇప్పటికే జీవీఎల్‌ కారుపై అత్యంత వేగం కింద కేసులు నమోదై ఉన్నట్లు ఆయన తెలిపారు. 

కారు ప్రమాదంలో మృతిచెందిన మహిళ కుటుంబానికి 50లక్షలు ఇవ్వాలని, గాయపడిన మహిళకు వైద్య చికిత్స కోసం రూ. 25లక్షలు ఇవ్వాలని ఆయన జీవిఎల్ నరసింహారావును డిమాండ్ చేశారు. బాధిత మహిళ కుటుంబానికి చంద్రన్న బీమా కింద రూ. 5లక్షలు ఇస్తామని ఆయన తెలిపారు.

గుంటూరులో శుక్రవారం జరిగిన జీవిఎల్ కారు ప్రమాదంలో ఓ మహిళ మరణించగా, మరో మహిళ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే.

బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు కారు ఢీకొని మహిళ మృతి

loader