గుంటూరు జిల్లాలోని తాడేపల్లి మండలంలోని కొలనుకొండ వద్ద శుక్రవారం సాయంత్రం బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కారు ఢీకొని ఓ మహిళ మృతి చెందింది.
గుంటూరు:గుంటూరు జిల్లాలోని తాడేపల్లి మండలంలోని కొలనుకొండ వద్ద శుక్రవారం సాయంత్రం బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కారు ఢీకొని ఓ మహిళ మృతి చెందింది. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.
Add Asianetnews Telugu as a Preferred Source

ఈ ఘటనలో జీవీఎల్ కారు డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.రోడ్డు దాటుతున్న వారిని తప్పించబోయి బీజేపీ ఎంపీ ప్రయాణిస్తున్న జీవీఎల్ కారు డివైడర్‌ని ఢీకొట్టింది. అనంతరం కారు అదుపు తప్పి మహిళతో పాటు మరో వ్యక్తిని ఢీకొట్టింది.

దీంతో కొద్దిసేపు సంఘటన స్థలంలో ట్రాఫిక్ జామ్ అయింది. ప్రమాదానికి కారణమైన బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కారు డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. ఈ ఘటనతో జీవీఎల్ నరసింహారావు మరో కారులో వెళ్లిపోయారు.
