అమ్మ, నాన్న తర్వాత... ఆ ఇంట్లో ఆడ పిల్లల బాధ్యత అన్నయ్య ది అని అందరూ చెబుతుంటారు. ఆపద సమయంలో చెల్లెలికి రక్షగా ఉండాలనే రాఖీ కూడా కడుతూ ఉంటారు. కంటికి రెప్పలా కాపాడాల్సిన అన్నే... చెల్లెలిపై కామవాంఛ తీర్చుకున్నాడు. ఈ దారుణ సంఘటన సంత బొమ్మాళిలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.... ఉప్పాడ సంతోష్(28) అనే యువకుడు వరసకు పిన్ని అయ్యే మహిళ ఇంటికి తరచూ వస్తూ వెళ్తుూ ఉండేవాడు. సదరు మహిళకు ఓ కుమార్తె ఉంది.ఆ బాలిక సంతోష్ ని సొంత అన్నలా భావించేది. అన్న అనే పిలిచేది కూడా. అయితే.... సంతోష్ మాత్రం బాలికపై కన్నేశాడు.  ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.

బాలికను బెదిరించి దాదాపు 2నెలల పాటు అకృత్యానికి పాల్పడ్డాడు. అక్కడితో ఆగకుండా ఆ దారుణాన్ని వీడియోలు, ఫోటోలు తీసి తన సెల్ ఫోన్ లో బంధించాడు. తాను అడిగినప్పుడల్లా కోరిక తీర్చకుంటే వీడియోలు, ఫోటోలు బయటపెడతానని బెదిరించేవాడు. 

కాగా... వారం రోజుల క్రితం కూడా సంతోష్... బాలికను అలానే బెదిరించాడు. అయితే.. బాలిక మాత్రం అందుకు అంగీకరించలేదు. దీంతో.. సంతోష్.. తన వద్ద ఉన్న ఫోటోలు, వీడియోలను అమెరికాలో ఉన్న బాలిక తండ్రికి వాట్సాప్ లో పంపాడు. అతను వెంటనే విషయాన్ని గ్రహించి ఇంట్లో ఉన్న భార్యకు ఫోన్ చేసి అసలు విషయాన్ని తెలియజేశాడు..

ఈ విషయంపై తల్లి బాలికను నిలదీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు  చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ఈ మేరకు కేసు నమోదు  చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.