ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బావ, వైఎస్ షర్మిల భర్త, మత బోధకుడు బ్రదర్ అనిల్ కుమార్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. కృష్ణా జిల్లా గరికపాడు వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో బ్రదర్  అనిల్ క్షేమంగా బయటపడ్డారు. తృటిలో పెను ప్రమాదం తప్పింది.

ప్రమాద సమయంలో బ్రదర్ అనిల్ కుమార్ తో పాటు.. డ్రైవర్, ఆయన గన్ మెన్లు ఉన్నారు. కాగా.. కారు అదుపు తప్పడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

Also Read ఎన్డీఎలోకి జగన్, చిరంజీవికి రాజ్యసభ సీటు: బొత్స మాటల ఆంతర్యం ఇదేనా?...

ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కారు ముందు భాగంగా డ్యామేజ్ అయ్యింది. విషయం తెలిసిన వెంటనే ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను వెంటనే సంఘటనాస్థలికి చేరుకున్నారు. 

ఉదయ భాను తన కారులో బ్రదర్ అనిల్ కుమార్, డ్రైవర్, గన్ మెన్ లను విజయవాడలోని ఎంజే నాయుడు ఆస్పత్రికి తీసుకువెళ్లాడు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం బ్రదర్ అనిల్ కుమార్ తన పర్యటనకు వెళ్లిపోవడం గమనార్హం.