విజయవాడ: విజయవాడలో ఓ పెళ్లికి వచ్చినవారిని  ఆశ్చర్యంలో ముంచెత్తాడు పెళ్లి కొడుకు కుటుంబసభ్యులు. పురాణాల్లో చెప్పినట్టుగానో సినిమాల్లో చూపినట్టుగా నూతన వధూవరులను పుష్పక విమానం తరహాలో ప్రత్యేక వాహానాన్ని తయారు చేయించి పెళ్లికి హాజరైన వారిని ఆశ్చర్యంలో ముంచెత్తారు.

విజయవాడకు చెందిన నంబూరు నారాయణరావు అనే వ్యాపారి తన కొడుకు సందీప్ వివాహ రిసెప్షన్ అంగరంగ వైభవంగా నిర్వహించాలని భావించారు. అయితే ఎవరూ చేపట్టనట్టుగా వినూత్నంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని ఆయన భావించాడు.

అనుకొన్నట్టుగానే నారాయణరావు తన కొడుకు కోడలు కోసం  పుష్పక విమానం లాంటి ప్రత్యేక రథాన్ని తయారు చేయించారు.  పెళ్లి రిసెప్షన్  వేదిక వద్దకు కొడుకు, కోడలును సందీప్ ఆయన భార్య సావర్యలను పుష్పక విమానం లాంటి రథంలో గ్రాండ్‌గా తీసుకొచ్చారు  క్రేన్ సహాయంతో 100 అడుగుల ఎత్తులో కొత్త వధూవరులను ఉంచి లేజర్ లైట్ల వెలుగులో  రిసెప్షన్ వేదిక వద్దకు తీసుకొచ్చారు.

పుష్పక విమానంలో కొత్త వధూవరులు ఉన్న సమయంలో పెళ్లికి వచ్చిన వారంతా సెల్పీలు దిగారు. సినిమాల్లో చూసినట్టుగానే ఈ పుష్పక విమానం  సీన్ థ్రిల్లింగ్ గా 
అనిపించినట్టుగా  స్థానికులు చెబుతున్నారు.