ఉదయం పెళ్లి.. రాత్రి కి. !

bride runs away after marraige with her boy friend
Highlights

ఉదయం పెళ్లి.. రాత్రి కి. !

వివాహమైన రోజే నవ వధువు అదృశ్యమైన సంఘటన కడప జిల్లా రాజంపేట చోటుచేసుకుంది. స్థానికంగా నివసించేఆరుపోయిన రమణమ్మ కుమార్తె సునీతకు ఈనెల 25న కోడూరుకు చెందిన వెంకటసుబ్బయ్యతో కోడూరులో వివాహంజరిగింది. పెళ్లయిన అనంతరం ఆదేరోజు సాయంత్రం నవ దంపతులు అత్తిరాలకు చేరుకొన్నారు. రాత్రి సమయంలో ఇంటిబయట అటుఇటూ తిరుగుతూ ఉన్న సునీత ఉన్నపళంగా కనిపించలేదు. కంగారు పడిన కుటుంబీకులు చుట్టుపక్కలబంధువులు, సన్నిహితుల ఇళ్లలో వెతికారు. ఫలితం లేకపోవడంతో ఆదివారం సాయంత్రం మన్నూరు పోలీసులనుఆశ్రయించారు. తల్లి రమణమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.

loader