పెళ్లి జరిగిన రెండు రోజులకే ఓ నవ వధువు ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాదకర సంఘటన కర్నూలు జిల్లా బేతంచర్లలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. బేతంచర్లకు చెందిన భాషాకు అదే ప్రాంతానికి చెందిన అంజుమ్ బేగంతో రెండు రోజుల క్రితం వివాహమైంది.

వధూవరులు మంగళవారం రాత్రి బైక్ పై బేతంచర్ల నుంచి వెల్దుర్తికి వెళ్తుండగా .. వారు వాహనాన్ని వేగంగా వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో వధూవరులిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. వారిని గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా.. వధువు అంజుమ్ కన్నుమూసింది.

వరుడు బాషా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా.. అంజుమ్ మృతితో వారి ఇరు కుటుంబాల్లో విషాదం చోటుచేసుకుంది.